రూ.20,000 కోట్ల సమీకరణలో అదానీ ఎంటర్‌ప్రైజెస్

అదానీ గ్రూపు ప్రధాన సంస్థ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (ఏఈఎల్‌) రూ.20,000 కోట్లను సమీకరించేందుకు సిద్ధమవుతోంది.

Published : 26 Nov 2022 03:10 IST

మలివిడత పబ్లిక్‌ ఆఫర్‌కు బోర్డు ఆమోదం

దిల్లీ: అదానీ గ్రూపు ప్రధాన సంస్థ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (ఏఈఎల్‌) రూ.20,000 కోట్లను సమీకరించేందుకు సిద్ధమవుతోంది. మలివిడత పబ్లిక్‌ ఆఫర్‌లో భాగంగా కొత్త షేర్ల జారీ ద్వారా ఈ నిధులను సమకరించనున్నట్లు ఎక్స్ఛేంజీలకు కంపెనీ తెలిపింది. ఇందుకు శుక్రవారం డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని పేర్కొంది. త్వరలోనే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా వాటాదార్ల అనుమతిని కూడా కంపెనీ తీసుకోనుంది. ప్రతిపాదిత పబ్లిక్‌ ఆఫర్‌ ప్రక్రియ వల్ల వాటాదార్ల విషయంలో వైవిధ్యం రావడంతో పాటు, మదుపర్లలో కంపెనీ;[ విశ్వసనీయతను మరింతగా పెంచుకునేందుకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో ప్రమోటర్లకు 72.63 శాతం వాటా ఉంది. మిగిలిన 27.37 శాతంలో 20 శాతం వరకు బీమా కంపెనీలు, విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్ల చేతిలో ఉంది. గతేడాది కాలంలో ఏఈఎల్‌ షేర్లు రెట్టింపునకు పైగా పెరిగాయి. మార్కెట్‌ విలువ రూ.4.46 లక్షల కోట్లకు చేరింది. ఇదే సమయంలో సెన్సెక్స్‌ 5.4 శాతమే లాభపడింది. కమొడిటీ ట్రేడింగ్‌ వ్యాపారం కోసం 1988లో ఏఈఎల్‌ను అదానీ గ్రూపు ఏర్పాటు చేసింది. కొత్త వ్యాపారాలను ప్రారంభించేందుకు ఈ సంస్థను ఒక వేదికగా ఉపయోగించుకుని.. ఆ తర్వాత వాటిని వేర్వేరు నమోదిత సంస్థలుగా విభజించుకుంటూ వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని