డిపాజిట్‌ రేట్లు పెంచిన యూబీఐ

యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) రూ.2 కోట్లలోపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంచింది. కొత్త రేట్లు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి.

Published : 26 Nov 2022 03:10 IST

ఈనాడు, హైదరాబాద్‌: యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) రూ.2 కోట్లలోపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంచింది. కొత్త రేట్లు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. 800 రోజుల డిపాజిట్‌పై 7.30% వడ్డీ అందిస్తున్నట్లు తెలిపింది. ఏడాది నుంచి 598 రోజుల వరకు 6.30%, 599 రోజులకు 7.00%, 600-699 రోజులకు 6.30%, 700 రోజుల వ్యవధికి 7.25% వడ్డీని ఇస్తోంది. 801 రోజుల నుంచి 3 ఏళ్లలోపు డిపాజిట్లపై 6.30%, మూడేళ్ల డిపాజిట్‌పై 7.30%, 3-10 ఏళ్ల డిపాజిట్లపై 6.70% వడ్డీ ఇస్తున్నట్లు తెలిపింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు