పసుపు దిద్దుబాటు!

పసిడి నవంబరు కాంట్రాక్టు గత 4 వారాల తరహాలోనే ఈవారమూ సానుకూలంగా కదలాడొచ్చు.

Published : 28 Nov 2022 00:52 IST

కమొడిటీస్‌
ఈ వారం

బంగారం

సిడి నవంబరు కాంట్రాక్టు గత 4 వారాల తరహాలోనే ఈవారమూ సానుకూలంగా కదలాడొచ్చు. ఒకవేళ రూ.52,860 కిందకు వస్తే రూ.52,745; రూ.52,572 వరకు చేరొచ్చు. రూ.53,440 కంటే పైన కదలాడితే మరింత రాణిస్తుందని భావించవచ్చు.

ఎంసీఎక్స్‌ బుల్‌డెక్స్‌ డిసెంబరు కాంట్రాక్టును రూ.14,707 లక్ష్యంతో, రూ.14,497 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని రూ.14,548 దిగువన కొనుగోళ్లకు మొగ్గు చూపడం మంచిదే.


వెండి

వెండి మార్చి కాంట్రాక్టు రూ.61,936 కంటే కిందకు రాకుంటే లాంగ్‌ పొజిషన్లను కొనసాగించడం మంచిదే. ఒకవేళ ఈ స్థాయి కంటే కిందకు వస్తే..   రూ.61,306కు పడిపోవచ్చు.


ప్రాథమిక లోహాలు

రాగి డిసెంబరు కాంట్రాక్టు రూ.669 కంటే కిందకు వస్తే.. దిద్దుబాటుకు ఆస్కారం ఉంటుంది. ఈ స్థాయిని లక్ష్యంగా పెట్టుకుని, రూ.679 స్టాప్‌లాస్‌తో రూ.671 సమీపంలో కాంట్రాక్టును షార్ట్‌ సెల్‌ చేయొచ్చు.

సీసం డిసెంబరు కాంట్రాక్టు రూ.182 కంటే కిందకు రాకుంటే మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది.

జింక్‌ డిసెంబరు కాంట్రాక్టు సానుకూల ధోరణిలో చలించవచ్చు. రూ.267 కంటే పైన చలించకుంటే.. షార్ట్‌ సెల్‌ చేయడం మంచిది.

అల్యూమినియం డిసెంబరు కాంట్రాక్టు రూ.196 కంటే దిగువన కదలాడకుంటే.. కొంత రాణించొచ్చు. ఈ స్థాయికి దిగువన చలిస్తే.. అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చు.


ఇంధన రంగం

ముడి చమురు డిసెంబరు కాంట్రాక్టు రూ.6,255 కంటే ఎగువన చలించకుంటే.. రూ.6,088; రూ.5,980 వరకు దిద్దుబాటు కావచ్చు. ఒకవేళ పైకి వెళ్తే,    రూ.6,531; రూ.6,639 వరకు చేరొచ్చు.

సహజ వాయువు డిసెంబరు కాంట్రాక్టు రూ.572 కంటే దిగువన కదలాడకుంటే.. కొనుగోళ్లకు మొగ్గు చూపొచ్చు.


వ్యవసాయ ఉత్పత్తులు

పసుపు డిసెంబరు కాంట్రాక్టు రూ.7,550 కంటే ఎగువన కదలాడకుంటే.. దిద్దుబాటు కావొచ్చు.

జీలకర్ర డిసెంబరు కాంట్రాక్టుకు రూ.23,923 దిగువన అమ్మకాల ఒత్తిడికి ఆస్కారం ఉంటుంది.

ధనియాలు డిసెంబరు కాంట్రాక్టు  రూ.9,246 కంటే కిందకు వస్తే.. మరింతగా పడిపోవచ్చు.

ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు