భారత వృద్ధి రేటు అంచనాల్లో కోత
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-23) భారత వృద్ధి రేటు అంచనాను 7 శాతానికి తగ్గిస్తున్నట్లు ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ వెల్లడించింది.
2022-23లో 7%: ఎస్అండ్పీ
దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-23) భారత వృద్ధి రేటు అంచనాను 7 శాతానికి తగ్గిస్తున్నట్లు ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ వెల్లడించింది. అయితే అంతర్జాతీయ మందగమన ప్రభావం భారత్‌పై తక్కువగానే ఉంటుందని పేర్కొంది. కాగా.. 2022-23కు వృద్ధి రేటును 7.3 శాతం గాను, 2023-24కు 6.5 శాతం గాను సెప్టెంబరులో ఎస్ అండ్ పీ అంచనా వేసింది. ‘దేశీయంగా గిరాకీపై ఎక్కువగా ఆధారపడే భారత్ లాంటి ఆర్థిక వ్యవస్థలపై ప్రపంచ మందగమన ప్రభావం పరిమితంగానే ఉండొచ్చు. 2022-23లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి 7 శాతంగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6 శాతంగా నమోదు కావచ్చ’ని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ ఆసియా-పసిఫిక్ ముఖ్య ఆర్థికవేత్త లూయిస్ కూయిజ్స్ తెలిపారు. 2021లో భారత ఆర్థిక వ్యవస్థ 8.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆసియా- పసిఫిక్ ప్రాంతంలోని కొన్ని దేశాల్లో కొవిడ్-19 ప్రభావం నుంచి దేశీయ గిరాకీ మరింత పుంజుకునే అవకాశం ఉందని ఎస్ అండ్ పీ తన నివేదికలో తెలిపింది. ఈ పరిణామం వచ్చే ఏడాది భారత్ వృద్ధికి కలిసి వస్తుందని పేర్కొంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం సగటున 6.8 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. 2023 మార్చి నాటికి ఆర్బీఐ కీలక రెపో రేటు 6.25 శాతానికి చేరుతుందని పేర్కొంది. మార్చి చివరి నాటికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ రూ.79.50కు దిగివస్తుందని తెలిపింది.
రెండో త్రైమాసికంలో 5.8%.. ఎస్బీఐ రీసెర్చ్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి 5.8 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. వివిధ సంస్థల సగటు అంచనాలతో పోలిస్తే ఇది 30 బేసిస్ పాయింట్లు తక్కువ. అధికారిక జీడీపీ గణాంకాలు రేపు (నవంబరు 30న) విడుదల కానున్నాయి.
బ్యాంకు రుణాల్లో 17.2% వృద్ధి: ఆర్బీఐ
జులై-సెప్టెంబరు 2022 త్రైమాసికంలో బ్యాంకుల రుణ వృద్ధి 17.2 శాతం మేర నమోదైందని.. ఇది ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయనడానికి నిదర్శనమని ఆర్బీఐ త్రైమాసిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంతక్రితం త్రైమాసికంలో రుణాల వృద్ధి 14.2 శాతంగా నమోదు కాగా, ఏడాది కిందట ఇదే మూడు నెలల కాలంలో 7 శాతంగా మాత్రమే ఉంది. ఆ నివేదికలోని ముఖ్యాంశాలు..
* డిపాజిట్ల సగటు వృద్ధి జూన్ 2021 నుంచీ 9.5-10.2 శాతానికి దగ్గరగానే ఉంది. సెప్టెంబరు 2022లో ఇది 9.8 శాతంగా ఉంది.
* డిసెంబరు 2020 నుంచీ గ్రామీణ, పాక్షిక పట్టణ, పట్టణ ప్రాంతాలతో పోలిస్తే మెట్రో నగరాల్లోని బ్యాంకు శాఖల్లో మంచి వార్షిక వృద్ధి నమోదవుతూ వస్తోంది.
* డిపాజిట్ల సేకరణలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేటు రంగ బ్యాంకులు మెరుగ్గా రాణిస్తున్నాయి
* సెప్టెంబరు 2022లో డిపాజిట్ల ఏడాది వారీ వృద్ధి అంతక్రితం ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 6.4 శాతం నుంచి 10.2 శాతానికి చేరింది.
* ఇక కరెంట్, సేవింగ్స్ డిపాజిట్ల వృద్ధి వరుసగా 9.4 శాతం నుంచి 8.8 శాతానికి; 17.5% నుంచి 14.5 శాతానికి తగ్గాయి.
* మొత్తం డిపాజిట్లలో సేవింగ్స్ డిపాజిట్ల వాటా జూన్ 2019లో 32.4 శాతంగా ఉండగా.. జూన్ 2022న 35.2 శాతం వద్ద గరిష్ఠాలకు చేరాయి. తాజా త్రైమాసికంలో అవి 34.7 శాతంగా నమోదయ్యాయి.
బ్యాంకుల రుణాల వృద్ధి బలంగానే: ఫిచ్
అధిక వడ్డీ రేట్ల ప్రభావం ఉన్నప్పటికీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల రుణ మంజూరులో బలమైన వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని ఫిచ్ రేటింగ్స్ వెల్లడించింది. ఈ పరిణామం నికర ఆదాయాలు పెరిగేందుకు దోహదం చేస్తుందని తెలిపింది. ముఖ్యంగా నికర వడ్డీ మార్జిన్లు ఇందుకు ఉపకరిస్తాయని పేర్కొంది. ‘2022-23లో బ్యాంకుల రుణాల వృద్ధి 13 శాతంగా ఉండొచ్చు. 2021-22లో ఇది 11.5 శాతంగా ఉంది. కొవిడ్-19 పరిణామాల తర్వాత ఆర్థిక కార్యకలాపాల్లో పురోగతి, అధిక జీడీపీ వృద్ధి.. బ్యాంకుల రుణాల్లో బలమైన వృద్ధికి దోహదం చేస్తుంది. రిటైల్, నిర్వహణ మూలధన విభాగాల రుణాలకు అధిక గిరాకీ ఉండొచ్చని భావిస్తున్నామ’ని ఫిచ్ ఒక ప్రకటనలో తెలిపింది. 2022-23లో భారత జీడీపీ వృద్ధి 7 శాతంగా నమోదుకావచ్చని అంచనా వేసింది. వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ.. రుణాల వృద్ధి కోసం నిధులను సమీకరించేందుకు భారత్ బ్యాంకులు సిద్ధంగానే ఉంటాయని పేర్కొంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: పల్నాడు జిల్లాలో కాల్పుల కలకలం.. తెదేపా మండలాధ్యక్షుడికి గాయాలు
-
Sports News
Usman Khawaja: వీసా ఆలస్యంతో ఆస్ట్రేలియా ఓపెనర్ అసంతృప్తి.. ఫన్నీ పోస్ట్ వైరల్
-
Movies News
Kiara Sidharth Malhotra: కియారా- సిద్ధార్థ్‌ల వివాహం అప్పుడేనా? శరవేగంగా పనులు..!
-
Movies News
Mukhachitram: విశ్వక్సేన్ ‘ముఖచిత్రం’.. ఓటీటీలోకి వచ్చేస్తోంది!
-
General News
Top 10 Budget Stories: కేంద్ర బడ్జెట్ - 2023 ప్రత్యేక కథనాలు!
-
Movies News
Social Look: సిల్క్‌స్మితలా దివి పోజు.. మేఘ ‘ప్రేమదేశం’ అప్పుడే