చిన్న మదుపర్లకు రాయితీపై షేర్లు!

అదానీ గ్రూప్‌ ప్రధాన సంస్థ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ మలివిడత పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓ)లో భాగంగా 2.5 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.20,000 కోట్లు) సమీకరించేందుకు సిద్ధమవుతోంది.

Published : 30 Nov 2022 02:13 IST

ఎఫ్‌పీఓపై అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ సీఎఫ్‌ఓ జుగేషిందర్‌ సింగ్‌

దిల్లీ: అదానీ గ్రూప్‌ ప్రధాన సంస్థ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ మలివిడత పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓ)లో భాగంగా 2.5 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.20,000 కోట్లు) సమీకరించేందుకు సిద్ధమవుతోంది. షేర్లను రాయితీ ధరకే ఇవ్వడం ద్వారా చిన్న మదుపర్లను ఆకర్షించాలని అదానీ గ్రూప్‌ భావిస్తోంది. మలివిడత పబ్లిక్‌ ఆఫర్‌లో కొత్త షేర్లను విక్రయించడానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డు గత శుక్రవారం ఆమోదం తెలిపింది. చిన్న మదుపర్లకు రాయితీ ధరకే షేర్లు ఇవ్వడానికి చూస్తున్నట్లు కంపెనీ ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్‌ఓ) జుగేషిందర్‌ సింగ్‌ పేర్కొన్నారు. గత కొన్నేళ్లలో వ్యూహాత్మక పెట్టుబడిదార్లు లభించారని, దీర్ఘకాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడితే.. ప్రతిఫలం లభించడానికి సమయం పడుతుందని, వీటిని పట్టించుకోని చిన్న మదుపర్ల కోసం చూస్తున్నట్లు వివరించారు. ఈ నిధుల సమీకరణ ద్వారా, అదానీ గ్రూప్‌ రుణభారాన్ని తగ్గించుకోవాలని భావిస్తోంది. అంతర్జాతీయంగా విశ్వసనీయత పెంచుకోవాలని, విమర్శకులకు సమాధానం ఇవ్వాలని భావిస్తోంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు