పరిశ్రమ హోదా ఇవ్వండి

సెబీ నమోదిత ఇంటర్మీడియరీలకు పరిశ్రమ హోదా కల్పించాలని స్టాక్‌ బ్రోకర్ల సంఘం యాన్మి కేంద్రానికి విన్నవించింది.

Published : 30 Nov 2022 02:13 IST

ఎస్‌టీటీ, సీటీటీ పూర్తిగా రద్దు చేయండి
కేంద్రానికి స్టాక్‌ బ్రోకర్ల సంఘం వినతి

దిల్లీ: సెబీ నమోదిత ఇంటర్మీడియరీలకు పరిశ్రమ హోదా కల్పించాలని స్టాక్‌ బ్రోకర్ల సంఘం యాన్మి కేంద్రానికి విన్నవించింది. పరిశ్రమ హోదా ఇవ్వడం వల్ల అనవసర ఆంక్షలు తొలగుతాయని; నిధులు-  మూలధన వ్యయాలు తగ్గుతాయని వివరించింది. కేంద్ర బడ్జెట్‌ 2023-24లో మరికొన్ని చర్యలు  తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. సెక్యూరిటీ లావాదేవీల పన్ను(ఎస్‌టీటీ), కమొడిటీల లావాదేవీల పన్ను(సీటీటీ)లను పూర్తిగా రద్దు చేయాలని; రూ.లక్ష వరకు స్వల్పకాల మూలధన లాభాలపై పన్ను మినహాయింపు ఇవ్వాలని; డివిడెండ్లపై పన్ను పరిమితిని పెంచాలని కేంద్రానికి విన్నవించింది. 900కు పైగా స్టాక్‌ బ్రోకర్లకు సభ్యత్వం కలిగిన యాన్మి ఆ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఛైర్మన్‌ (సీబీడీటీ) నితిన్‌ గుప్తాకు తన సిఫారసులను సమర్పించింది. ఎస్‌టీటీ, సీటీటీ చెల్లింపులపై సెక్షన్‌ 88ఈ కింద రిబేటును పునరుద్ధరించాలని కోరారు. తద్వారా లావాదేవీలు పెరిగి ఎస్‌టీటీ, సీటీటీ వసూళ్లు పెద్ద స్థాయిల్లో నమోదవుతాయని యాన్మి వివరించింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు