డిజిటల్‌ రుణాల కోసం ఐలెన్స్‌

ఆన్‌లైన్‌ పద్ధతిలో రుణాల జారీని మరింత సులభతరం చేసేందుకు ఐసీఐసీఐ బ్యాంక్‌ ఐలెన్స్‌ పేరుతో కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది.

Published : 30 Nov 2022 02:13 IST

టీసీఎస్‌ సహకారంతో విడుదల చేసిన ఐసీఐసీఐ బ్యాంక్‌

ముంబయి: ఆన్‌లైన్‌ పద్ధతిలో రుణాల జారీని మరింత సులభతరం చేసేందుకు ఐసీఐసీఐ బ్యాంక్‌ ఐలెన్స్‌ పేరుతో కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీనిని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌)తో కలిసి రూపొందించినట్లు వెల్లడించింది. ఐలెన్స్‌ ద్వారా వ్యక్తిగత, వాహన రుణాలతో పాటు, క్రెడిట్‌ కార్డులు అందించేందుకు ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏర్పాట్లు చేస్తోంది. ఖాతాదారులు తక్కువ సమాచారాన్ని ఇవ్వడంతోనే సులభంగా లాగిన్‌ అయ్యి, ఎంత రుణం వస్తుందో తెలుసుకోవచ్చు. ఐలెన్స్‌లో ఇ-సంతకం, ఇ-ఎన్‌ఏసీహెచ్‌, ఇ-స్టాంపు లాంటి సౌకర్యాలతో తక్కువ పత్రాల అవసరం ఉంటుందని బ్యాంకు వెల్లడించింది. దరఖాస్తు నుంచి రుణం మంజూరు వరకు అంతా డిజిటల్‌లోనే సాగుతుందని పేర్కొంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు