ఫేమ్‌-2 నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహన సంస్థలపై చర్యలు

విద్యుత్తు వాహనాల తయారీ, వినియోగాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న  ఫేమ్‌-2 పథకం కింద, వాహన తయారీలో స్థానిక సమీకరణ నిబంధనలను ఉల్లంఘిస్తున్న కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భారీ పరిశ్రమల మంత్రి మహేంద్రనాథ్‌ పాండే మంగళవారం వెల్లడించారు.

Published : 30 Nov 2022 02:15 IST

భారీ పరిశ్రమల మంత్రి మహేంద్రనాథ్‌ పాండే

దిల్లీ: విద్యుత్తు వాహనాల తయారీ, వినియోగాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న  ఫేమ్‌-2 పథకం కింద, వాహన తయారీలో స్థానిక సమీకరణ నిబంధనలను ఉల్లంఘిస్తున్న కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భారీ పరిశ్రమల మంత్రి మహేంద్రనాథ్‌ పాండే మంగళవారం వెల్లడించారు. అసోచామ్‌ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలపై దర్యాప్తు జరుగుతోందని, నిజం తేలేవరకు ఆయా సంస్థలకు రాయితీల పంపిణీ ఆపేశామని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలిన కంపెనీలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. హీరో ఎలక్ట్రిక్‌, ఒకినవా ఆటోటెక్‌, రివోల్ట్‌, ఒకోయే, ఆంపియర్‌, జితేంద్ర ఈవీ తదితర కంపెనీలు ఫేమ్‌-2 నిబంధనలు ఉల్లంఘించాయని ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద పని చేసే ఆటోమోటివ్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఆర్‌ఏఐ) ఆయా కంపెనీలపై దర్యాప్తు జరుపుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని