బాస్మతియేతర బియ్యం, నూకల ఎగుమతులపై నిషేధం ఎత్తివేత

ఆర్గానిక్‌ బాస్మతియేతర బియ్యం, నూకల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం మంగళవారం ఎత్తివేసింది.

Published : 30 Nov 2022 02:15 IST

దిల్లీ: ఆర్గానిక్‌ బాస్మతియేతర బియ్యం, నూకల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం మంగళవారం ఎత్తివేసింది. దేశీయ సరఫరాలు సమృద్ధిగా ఉండటంతో పాటు, ధరలు అందుబాటులోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబరు ప్రారంభంలో దేశీయ లభ్యత పెంచేందుకు నూకల ఎగుమతులపై ప్రభుత్వం నిషేధం విధించింది. దీని తర్వాత బాస్మతి యేతర బియ్యం ధరలు రిటైల్‌ విపణుల్లో పెరిగిన నేపథ్యంలో, దేశీయ సరఫరాలు పెంచేందుకు వీలుగా వీటి ఎగుమతులపై 20 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. సెప్టెంబరు నిషేధానికి ముందు ఆర్గానిక్‌ నాన్‌-బాస్మతి, నూకల బియ్యంపై ఎలాంటి స్థితి ఉందో అదే ఇకపై కొనసాతుందని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని