మదుపర్ల సంపద రూ.286 లక్షల కోట్లకు
వరుసగా ఆరో రోజూ పరుగులు తీసిన సూచీలు, తాజా జీవనకాల గరిష్ఠాలను అధిరోహించాయి.
సమీక్ష
వరుసగా ఆరో రోజూ పరుగులు తీసిన సూచీలు, తాజా జీవనకాల గరిష్ఠాలను అధిరోహించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు కొనసాగడం సెంటిమెంట్‌ను బలపరిచాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 4 పైసలు తగ్గి 81.72 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు ధర 2.45 శాతం పెరిగి 85.23 డాలర్ల వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లలో టోక్యో మినహా మిగతావి రాణించాయి. ఐరోపా షేర్లు లాభాల్లో కదలాడాయి.
* మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ రికార్డు గరిష్ఠమైన 286.15 లక్షల కోట్లుగా నమోదైంది.
* సెన్సెక్స్ ఉదయం 62,362.08 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైనా, వెంటనే పుంజుకుని లాభాల్లోకి వచ్చింది. ఇంట్రాడేలో 62,887.40 పాయింట్ల వద్ద తాజా జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. ఆఖర్లో లాభాల స్వీకరణ జరగడంతో 177.04 పాయింట్ల లాభంతో 62,681.84 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 55.30 పాయింట్లు పెరిగి 18,618.05 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 18,678.10 దగ్గర రికార్డు గరిష్ఠాన్ని నమోదుచేసింది.
* సెన్సెక్స్ 30 షేర్లలో 15 లాభపడ్డాయి. హిందుస్థాన్ యునిలీవర్ 4.27%, సన్‌ఫార్మా 1.50%, నెస్లే 1.50%, డాక్టర్ రెడ్డీస్ 1.17%, టాటా స్టీల్ 1.14%, ఐసీఐసీఐ బ్యాంక్ 1.12%, టైటన్ 0.97% రాణించాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ 1.50%, బజాజ్ ఫిన్సర్వ్ 1.27%, మారుతీ 1.04%, పవర్‌గ్రిడ్ 0.97%, ఎల్ అండ్ టీ 0.70% నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో.. ఎఫ్ఎమ్సీజీ 1.73%, లోహ 0.57%, మన్నికైన వినిమయ వస్తువులు 0.58%, ఆరోగ్య సంరక్షణ 0.54% మెరిశాయి. వినియోగ, ఇంధన, పరిశ్రమలు, టెలికాం, వాహన, బ్యాంకింగ్ నీరసపడ్డాయి. బీఎస్ఈలో 1663 షేర్లు లాభాల్లో ముగియగా, 1823 స్క్రిప్‌లు నష్టపోయాయి. 141 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
* ఎస్బీఐ రూ.10000 కోట్ల సమీకరణ: 2022-23లో పబ్లిక్ ఇష్యూ లేదా ప్రైవేట్ ప్లేస్మెంట్ పద్ధతిలో మౌలిక బాండ్లను జారీ చేయడం ద్వారా రూ.10000 కోట్లు సమీకరించడానికి బోర్డు ఆమోదం తెలిపినట్లు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రకటించింది. ఇందులో రూ.5000 కోట్ల గ్రీన్ షూ ఆప్షన్ ఉంది.
* రాబోయే 3-6 నెలల్లో విమానాశ్రయాల అనుబంధ సంస్థలో దాదాపు 3 శాతం వాటాను 300-500 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.2450- 4100 కోట్ల)కు విక్రయించాలని అదానీ ఎంటర్ప్రైజెస్ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
* ప్రభుత్వ అత్యవసర రుణహామీ పథకం (ఈసీఎల్జీఎస్) కింద గో ఫస్ట్ అదనంగా రూ.400 కోట్లు పొందింది. ఈ పథకం కింద కంపెనీ రూ.1500 కోట్లు వరకు రుణం తీసుకునే అవకాశం ఉండగా, ఇప్పటివరకు రూ.800 కోట్లు అందుకుంది. రాబోయే వారాల్లో 16 కొత్త పీ అండ్ డబ్ల్యూ ఇంజిన్లు వస్తే మరిన్ని విమానాలు నడిపే అవకాశం ఉంటుందని కంపెనీ భావిస్తోంది.
* ముంబయిలో అతిపెద్ద మురికి వాడ అయిన ధారావి పునరాభివృద్ధి ప్రాజెక్ట్ బిడ్‌ను అదానీ ప్రోపర్టీస్ గెలుచుకుంది. ఈ ప్రాజెక్ట్ విలువ రూ.5,069 కోట్లు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Harish Rao: వైద్యరంగంలో మనం దేశానికే ఆదర్శం: హరీశ్‌రావు
-
General News
Srisailam: శ్రీశైలం ఘాట్రోడ్లో రక్షణ గోడను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Movies News
Chiranjeevi: జన్మజన్మలకు నీకే బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటున్నాం..: చిరంజీవి
-
India News
PM Modi: బడ్జెట్ సమావేశాల వేళ.. మంత్రులతో ప్రధాని మోదీ కీలక భేటీ
-
General News
TelangaNews: ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై టీఎస్ఎల్పీఆర్బీ కీలక నిర్ణయం