రూ.300 కోట్లతో ఎంవైకే లాటిక్రీట్‌ విస్తరణ

నిర్మాణ రంగంలో ఉపయోగించే టైల్స్‌, స్టోన్‌ ఇన్‌స్టలేషన్‌ ఉత్పత్తులను తయారు చేసే హైదరాబాద్‌ సంస్థ ఎంవైకే లాటిక్రీట్‌ 2023 చివరికి 3 కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది.

Published : 01 Dec 2022 01:36 IST

ప్రచారకర్తగా ధోనీ నియామకం

ఈనాడు, హైదరాబాద్‌: నిర్మాణ రంగంలో ఉపయోగించే టైల్స్‌, స్టోన్‌ ఇన్‌స్టలేషన్‌ ఉత్పత్తులను తయారు చేసే హైదరాబాద్‌ సంస్థ ఎంవైకే లాటిక్రీట్‌ 2023 చివరికి 3 కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. కోల్‌కతా, గుజరాత్‌, ఇండోర్‌లలో ఏర్పాటు చేయనున్న వీటి కోసం రూ.300-400 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మురళి యాదమ వెల్లడించారు. ప్రస్తుతం సంస్థకు 5 తయారీ యూనిట్లలో 1,000 మంది ఉద్యోగులుండగా, కొత్తగా మరో 500 మందిని నియమించుకుంటామని తెలిపారు. దేశ వ్యాప్తంగా 28 ప్రాంతీయ కార్యాలయాలు, అత్యాధునిక పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఉందన్నారు. తమ సంస్థ ప్రచారకర్తగా భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనిని నియమించుకున్నట్లు బుధవారం ఇక్కడ తెలిపారు. టైల్‌ అథెసివ్‌, టైట్‌ గ్రౌట్‌, స్టోన్‌ కేర్‌ ఉత్పత్తులను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. శంషాబాద్‌, బెంగళూరు విమానాశ్రయాలు, హైదరాబాద్‌ మెట్రో, ఐటీసీ కోహినూర్‌ తదితర ప్రదేశాల్లో తమ ఉత్పత్తులు వినియోగించినట్లు పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని