ద్రవ్యలోటు మరింత పెరిగింది

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబరు చివరికి ద్రవ్యలోటు రూ.7,58,137 కోట్లుగా నమోదైంది. పూర్తి ఆర్థిక సంవత్సర లక్ష్యం (రూ.16.61 లక్షల కోట్ల)లో ఇది 45.6 శాతానికి సమానం.

Published : 01 Dec 2022 01:36 IST

ఏప్రిల్‌- అక్టోబరులో రూ.7,58,137 కోట్లు

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబరు చివరికి ద్రవ్యలోటు రూ.7,58,137 కోట్లుగా నమోదైంది. పూర్తి ఆర్థిక సంవత్సర లక్ష్యం (రూ.16.61 లక్షల కోట్ల)లో ఇది 45.6 శాతానికి సమానం. వ్యయాలు, ఆదాయాల మధ్య అంతరమైన ద్రవ్యలోటును గమనిస్తే.. మార్కెట్‌ నుంచి ప్రభుత్వం తీసుకునే అప్పులపై అవగాహన ఏర్పడుతుంది. 2021-22లో ఇదే కాలానికి ద్రవ్యలోటు అప్పటి బడ్జెట్‌ లక్ష్యంలో 36.3 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 6.4 శాతానికి పరిమితం కావచ్చని ప్రభుత్వం అంచనా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని