20 నెలల కనిష్ఠానికి ‘మౌలికం’

అక్టోబరులో మౌలిక రంగం నెమ్మదించింది. 8 కీలక రంగాల ఉత్పత్తి వృద్ధి రేటు 0.1 శాతానికి పరిమితమైంది.

Published : 01 Dec 2022 01:36 IST

దిల్లీ: అక్టోబరులో మౌలిక రంగం నెమ్మదించింది. 8 కీలక రంగాల ఉత్పత్తి వృద్ధి రేటు 0.1 శాతానికి పరిమితమైంది. ఇది 20 నెలల కనిష్ఠ స్థాయి. ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, సిమెంట్‌ తదితర రంగాల ఉత్పత్తి క్షీణించడమే ఇందుకు కారణం. 2021 అక్టోబరులో ఈ రంగాల ఉత్పత్తి వృద్ధి 8.7 శాతంగా ఉంది. ఈ ఏడాది సెప్టెంబరులోనూ కీలక రంగాల ఉత్పత్తి వృద్ధి 7.8 శాతంగా నమోదైంది. 2021 ఫిబ్రవరిలో 3.3 శాతం క్షీణతను నమోదు చేశాక, ఇంత తక్కువగా నమోదు కావడం మళ్లీ ఇప్పుడే.

* ఈసారి ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, సిమెంట్‌ ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. ఎరువుల రంగం ఉత్పత్తి 5.4% వృద్ధి చెందింది. బొగ్గు, ఉక్కు, విద్యుత్‌ రంగాల ఉత్పత్తి నెమ్మదించి వరుసగా 3.6 శాతం, 4 శాతం, 0.4 శాతంగా నమోదైంది.

* 8 కీలక రంగాల గణాంకాలు పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ)పై ప్రభావం చూపుతాయి. వీటి వాటా ఐఐపీలో 40.27% ఉంటుంది.

* ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-అక్టోబరులో మౌలిక వృద్ధి 8.2 శాతంగా నమోదైంది. 2021-22 ఇదే కాలంలో ఇది 15.6 శాతంగా ఉంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు