శామ్‌సంగ్‌ ఇండియాలో 1,000 నియామకాలు

దేశవ్యాప్తంగా తన పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) విభాగాల కోసం 1,000 మంది ఇంజినీర్లను నియమించుకుంటామని శామ్‌సంగ్‌ ఇండియా వెల్లడించింది.

Published : 01 Dec 2022 01:36 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా తన పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) విభాగాల కోసం 1,000 మంది ఇంజినీర్లను నియమించుకుంటామని శామ్‌సంగ్‌ ఇండియా వెల్లడించింది. బెంగళూరు, నోయిడా, దిల్లీలోని ఆర్‌అండ్‌డీ కేంద్రాల్లో, బెంగళూరులోని శామ్‌సంగ్‌ సెమీకండక్టర్‌ ఇండియా రీసెర్చ్‌లో కొత్త తరం సాంకేతికతలపై పనిచేసేందుకు ఈ నియామకాలు చేపడుతున్నట్లు శామ్‌సంగ్‌ ఇండియా మానవ వనరుల విభాగాధిపతి సమీర్‌ వాద్వాన్‌ తెలిపారు. 2023లో ఈ యువ ఇంజినీర్లు కంపెనీలో చేరతారని పేర్కొన్నారు. కంప్యూటర్‌ సైన్స్‌తో పాటు కృత్రిమ మేధ, మెషీన్‌ లెర్నింగ్‌, కంప్యూటర్‌ విజన్‌, వీఎల్‌ఎస్‌ఐ, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, కమ్యూనికేషన్స్‌ నెట్‌వర్క్‌ విభాగాల్లో ఈ నియామకాలు ఉండనున్నాయి. మద్రాస్‌, దిల్లీ, హైదరాబాద్‌, బొంబాయి, రూర్కే, ఖరగ్‌పూర్‌, కాన్పూర్‌, గువాహటి, బీహెచ్‌యూ ఐఐటీలతో పాటు ప్రముఖ విద్యాలయాల నుంచే సుమారు 200 మందిని నియమించుకోనున్నట్లు శామ్‌సంగ్‌ ఇండియా తెలిపింది. ఈ ఐఐటీలతో పాటు ఇతర దిగ్గజ విద్యాలయాల్లో 400 మందికి పైగా ప్రీ ప్లేస్‌మెంట్‌ ఆఫర్లు ఇవ్వనున్నట్లు పేర్కొంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు