జీడీపీ వృద్ధి 6.3%
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై- సెప్టెంబరు త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 6.3 శాతంగా నమోదైంది. 2021-22 ఇదే త్రైమాసిక వృద్ధి 8.4%, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ వృద్ధి 13.5%తో పోలిస్తే ఇది తక్కువే.
ఏడాది క్రితంతో పోలిస్తే తక్కువ
తయారీ, గనుల రంగాల పేలవ ప్రదర్శన వల్లే
దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై- సెప్టెంబరు త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 6.3 శాతంగా నమోదైంది. 2021-22 ఇదే త్రైమాసిక వృద్ధి 8.4%, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ వృద్ధి 13.5%తో పోలిస్తే ఇది తక్కువే. తయారీ, గనుల రంగాల పేలవ ప్రదర్శనే ఇందుకు కారణం. అయితే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతోంది. జులై- సెప్టెంబరులో చైనా వృద్ధి 3.9 శాతం కావడమే ఇందుకు కారణం.
ఆర్‌బీఐ అంచనాలకు తగ్గట్లే..
జులై- సెప్టెంబరు వృద్ధి 6.1- 6.3 శాతంగా ఉండొచ్చని ఆర్‌బీఐ ఈ నెల ప్రారంభంలో అంచనా వేయగా, అలానే నమోదైంది. అయితే ఏప్రిల్- జూన్ నాటి 13.5 శాతంలో సగం మేర నమోదుకావొచ్చన్న విశ్లేషకుల అంచనా కంటే ఇది తక్కువ. 2022-23 తొలి ఆరు నెలల్లో జీడీపీ వృద్ధి 9.7% శాతంగా ఉంది. 2021-22 ఏప్రిల్-సెప్టెంబరులో ఇది 13.7%.
మరికొన్ని వివరాలిలా..
జులై- సెప్టెంబరులో స్థూల విలువ జోడింపు (జీవీఏ) 5.6 శాతం పెరిగి రూ.35.05 లక్షల కోట్లకు చేరింది.
ఇవి సానుకూలం: ఏడాది క్రితంతో పోలిస్తే వ్యవసాయ రంగంలో జీవీఏ వృద్ధి 3.2% నుంచి 4.6 శాతానికి పెరిగింది. సేవలకు సంబంధించి వాణిజ్యం, ఆతిథ్యం, రవాణా, కమ్యూనికేషన్స్, సేవల రంగాల్లో 9.6% నుంచి 14.7 శాతానికి పెరిగింది. ఆర్థిక సేవలు, స్థిరాస్తి వృత్తి నిపుణుల సేవల విభాగంలో 6.1% నుంచి 7.2 శాతానికి పెరిగింది.
ఇవి ప్రతికూలం: తయారీ రంగ జీవీఏ వృద్ధి 14.5% నుంచి 2.8 శాతానికి, గనుల రంగంలో 14.5% నుంచి 2.8 శాతానికి, నిర్మాణ రంగంలో 8.1% నుంచి 6.6 శాతానికి; విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర వినియోగ సేవల విభాగాల్లో 8.5% నుంచి 5.6 శాతానికి, ప్రభుత్వ నిర్వహణ, రక్షణ, ఇతర సేవల విభాగాల్లో 19.4% నుంచి 6.5 శాతానికి తగ్గింది.
ప్రస్తుత ధరల వద్ద జులై- సెప్టెంబరులో జీడీపీని రూ.65.31 లక్షల కోట్లుగా ఎన్‌ఎస్‌ఓ అంచనా వేసింది. 2021-22 ఇదే కాలంలో నమోదైన రూ.56.20 లక్షల కోట్లతో పోలిస్తే 16.2% వృద్ధి నమోదైంది.
2022-23లో 6.8- 7% వృద్ధి: సీఈఏ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంమీద జీడీపీ వృద్ధి 6.8-7 శాతంగా నమోదు కావచ్చని ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
‘వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటేయం’.. ఎచ్చెర్ల ఎమ్మెల్యేకు తేల్చిచెప్పిన వైకాపా కార్యకర్తలు
-
Crime News
కారుపై ‘పొక్లెయిన్’ పిడుగు!.. ముగ్గురి దుర్మరణం.. ఇద్దరికి తీవ్రగాయాలు
-
Ts-top-news News
రైళ్లపై రాళ్లేస్తే అయిదేళ్ల శిక్ష.. ద.మ.రైల్వే హెచ్చరిక
-
World News
వీర్యదానంతో 550 మందికి తండ్రైన వైద్యుడు
-
Ts-top-news News
రంగంలోకి కేంద్ర నిఘా సంస్థ.. డేటా లీకేజీ వ్యవహారంలో మలుపులు
-
Ap-top-news News
పాపికొండల విహారయాత్రకు పచ్చ జెండా