నెక్సస్‌ మాల్స్‌ ప్రచారకర్త అమితాబ్‌ బచ్చన్‌

అంతర్జాతీయ పెట్టుబడుల సంస్థ బ్లాక్‌స్టోన్‌కు చెందిన రిటైల్‌ అనుబంధ సంస్థ నెక్సస్‌ మాల్స్‌కు ప్రచారకర్తగా ప్రముఖ బాలీవుడ్‌ నటులు అమితాబ్‌ బచ్చన్‌ వ్యవహరించనున్నారు.

Published : 02 Dec 2022 04:25 IST

దిల్లీ: అంతర్జాతీయ పెట్టుబడుల సంస్థ బ్లాక్‌స్టోన్‌కు చెందిన రిటైల్‌ అనుబంధ సంస్థ నెక్సస్‌ మాల్స్‌కు ప్రచారకర్తగా ప్రముఖ బాలీవుడ్‌ నటులు అమితాబ్‌ బచ్చన్‌ వ్యవహరించనున్నారు. బ్లాక్‌స్టోన్‌ రియల్‌ ఎస్టేట్‌ ఫండ్స్‌ యాజమాన్య నిర్వహణలో, దేశ వ్యాప్తంగా 13 నగరాల్లో 17 నెక్సస్‌ మాల్స్‌ ఉన్నాయి.  బ్లాక్‌స్టోన్‌ ప్రాయోజిత నెక్సస్‌ సెలెక్ట్‌ ట్రస్ట్‌ గత నెలలోనే రిటైల్‌ రీట్‌ (రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌) తొలి పబ్లిక్‌ ఇష్యూ ద్వారా సుమారు 500 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.4,100 కోట్లు) నిధుల్ని సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. 17 షాపింగ్‌ మాల్స్‌ సుమారు 10 మిలియన్‌ చదరపు అడుగుల వైశాల్యంలో ఉన్నాయని, వీటి విలువ 3 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.24,400 కోట్లు) ఉండొచ్చని సంస్థ పేర్కొంది. ‘నెక్సస్‌ మాల్స్‌ కుటుంబంలోకి అమితాబ్‌ బచ్చన్‌ను స్వాగతించడాన్ని గౌరవంగా భావిస్తున్నాం. వివిధ వయసుల వారిని చేరువ చేసే సత్తా ఆయనకు ఉంద’ని నెక్సస్‌ మాల్స్‌ సీఈఓ దలీప్‌ సెహ్గల్‌ వెల్లడించారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని