పీఎన్‌బీ, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలకు నూతన ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ), సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లకు నూతన ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లను కేంద్ర ప్రభుత్వం నియమించింది.

Published : 02 Dec 2022 04:24 IST

ఈనాడు, హైదరాబాద్‌: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ), సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లకు నూతన ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లను కేంద్ర ప్రభుత్వం నియమించింది. పీఎన్‌బీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పదవిలో నియమితులైన ఎం. పరమశివమ్‌ మూడేళ్ల పాటు కొనసాగుతారు. వ్యవసాయ శాస్త్రంలో పట్టభద్రుడైన పరమశివమ్‌ కెనరా బ్యాంకులో వ్యవసాయ విస్తరణ అధికారిగా తన ఉద్యోగ సోపానాన్ని ప్రారంభించారు. దాదాపు 3 దశాబ్దాల పాటు వివిధ హోదాల్లో పనిచేసి, ఇప్పుడీ పదవి చేపట్టారు.  సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ఎం.వి.మురళీ కృష్ణ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ నెల 1 నుంచి ఆయన నియామకం అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఆయన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో సీజీఎంగా పనిచేస్తున్నారు. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌లో ఎంబీఏ చేసిన ఎం.వి.మురళీ కృష్ణ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ప్రొబేషనరీ అధికారిగా చేరి చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ స్థాయికి ఎదిగారు. క్రెడిట్‌, ఎన్నారై బిజినెస్‌, రూరల్‌ బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్‌... తదితర విభాగాల్లో పనిచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని