వాట్సప్‌పై జియోమార్ట్‌ సేవలు

వాట్సప్‌ నుంచే ఆర్డర్లు ఇచ్చి, కావాల్సిన నిత్యావసర సరకులను ఇంటికి తెప్పించుకునే సేవను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రిలయన్స్‌ రిటైల్‌కు చెందిన జియోమార్ట్‌ ప్రకటించింది.

Published : 02 Dec 2022 03:40 IST

హైదరాబాద్‌: వాట్సప్‌ నుంచే ఆర్డర్లు ఇచ్చి, కావాల్సిన నిత్యావసర సరకులను ఇంటికి తెప్పించుకునే సేవను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రిలయన్స్‌ రిటైల్‌కు చెందిన జియోమార్ట్‌ ప్రకటించింది. వాట్సప్‌పై ఈ సేవలు పొందేందుకు ‘7977079770’ నంబరుకు ‘గ్రేట్‌ డీల్స్‌ ఆన్‌ జియోమార్ట్‌’ అనే సందేశం పంపాలి. లేదా క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలి. వెంటనే వినియోగదారుడికి షాపింగ్‌ క్యాటలాగ్‌, అమలవుతున్న ఆఫర్ల వివరాలు నోటిఫికేషన్‌లుగా వస్తాయి. అనంతరం కావాల్సిన వస్తువుల కోసం జియోమార్ట్‌పై ఆర్డరు పెట్టొచ్చు. కనీసం రూ.250 విలువకు మించి ఆర్డరు పెడితే 30 శాతం వరకు (గరిష్ఠంగా రూ.120) రాయితీ లభిస్తుందని జియోమార్ట్‌ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని