3 నెలల గరిష్ఠానికి నిరుద్యోగ రేటు

దేశంలో నిరుద్యోగ రేటు నవంబరులో 8 శాతంగా నమోదైంది. ఇది మూడు నెలల గరిష్ఠమని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో 8.96 శాతంగా, గ్రామీణ ప్రాంతాల్లో 7.55 శాతంగా నిరుద్యోగ రేటుంది.

Published : 02 Dec 2022 03:45 IST

నవంబరులో 8%: సీఎంఐఈ

ముంబయి: దేశంలో నిరుద్యోగ రేటు నవంబరులో 8 శాతంగా నమోదైంది. ఇది మూడు నెలల గరిష్ఠమని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో 8.96 శాతంగా, గ్రామీణ ప్రాంతాల్లో 7.55 శాతంగా నిరుద్యోగ రేటుంది. అక్టోబరులో ఇవి వరుసగా 7.21 శాతం, 8.04 శాతంగా నమోదయ్యాయి.

రాష్ట్రాల వారీగా చూస్తే.. హరియాణా 30.6 శాతం, రాజస్థాన్‌ (24.5%), జమ్ము కశ్మీర్‌ (23.9%), బిహార్‌ (17.3%), త్రిపుర (14.5%) అధిక నిరుద్యోగ రేటును కలిగి ఉన్నాయి. తక్కువ నిరుద్యోగ రేటు ఉన్న రాష్ట్రాలుగా చత్తీస్‌గఢ్‌ (0.1%), ఉత్తరాఖండ్‌ (1.2%), ఒడిశా (1.6%), కర్ణాటక (1.8%), మేఘాలయ (2.1%) నిలిచాయి. అక్టోబరులో భారత నిరుద్యోగ రేటు 7.77 శాతం కాగా.. సెప్టెంబరులో 6.43 శాతంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని