ఎన్‌ఎమ్‌డీసీ నాగర్నార్‌ స్టీల్‌ ప్లాంటు

ఎన్‌ఎమ్‌డీసీకి చెందిన నాగర్నార్‌ స్టీల్‌ ప్లాంటు వ్యూహాత్మక విక్రయానికి ప్రాథమిక బిడ్లకు ప్రభుత్వం గురువారం ఆహ్వానం పలికింది.

Published : 02 Dec 2022 03:45 IST

ప్రైవేటీకరణకు బిడ్ల ఆహ్వానం

దిల్లీ: ఎన్‌ఎమ్‌డీసీకి చెందిన నాగర్నార్‌ స్టీల్‌ ప్లాంటు వ్యూహాత్మక విక్రయానికి ప్రాథమిక బిడ్లకు ప్రభుత్వం గురువారం ఆహ్వానం పలికింది. బిడ్ల దాఖలుకు ఆఖరు తేదీ 2023 జనవరి 27గా నిర్ణయించింది. సందేహాలను అడగడానికి చివరి తేదీ 2022 డిసెంబరు 29 అని పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం(దీపమ్‌) పేర్కొంది. ఎన్‌ఎమ్‌డీసీ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ ప్లాంట్‌(ఎన్‌ఐఎస్‌పీ)ను ఎన్‌ఎమ్‌డీసీ నుంచి విడదీసి ఎన్‌ఎమ్‌డీసీ స్టీల్‌ లిమిటెడ్‌(ఎన్‌ఎస్‌ఎల్‌)గా మార్చే ప్రక్రియలో కంపెనీ ఉంది. ఈ విభజన అనంతరం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ, కల్‌కత్తా స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో ఎన్‌ఎస్‌ఎల్‌ షేర్లు లిస్టవుతాయి. ఎన్‌ఎమ్‌డీసీలో ప్రభుత్వం(60.79%), ప్రజల(391.21%)కు ఉన్న వాటాల తరహాలోనే  ఎన్‌ఎస్‌ఎల్‌లోనూ వాటాలుంటాయి. ఆ తర్వాత దీపమ్‌ ద్వారా ప్రభుత్వం అందులో 50.79 శాతం వాటాను యాజమాన్య నియంత్రణతో పాటు వ్యూహాత్మక కొనుగోలుదారుకు రెండు దశల్లో జరిగే బిడ్డింగ్‌ ప్రక్రియ ద్వారా అందజేస్తుంది. ఈ విభజనకు కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎమ్‌సీఏ) ఈ ఏడాది అక్టోబరు 6నే అనుమతి ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని