సంక్షిప్తంగా

రష్యా సహా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చమురు కొనుగోలు చేయడం భారత్‌ కొనసాగిస్తుందని ఉన్నతాధికారులు వెల్లడించారు.

Published : 03 Dec 2022 01:31 IST

రష్యా సహా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చమురు కొనుగోలు చేయడం భారత్‌ కొనసాగిస్తుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. రష్యాపై ఐరోపా సమాఖ్య ఆంక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను రిటైల్‌ డిజిటల్‌ రూపాయి మారుస్తుందని ఎస్‌బీఐ ఛైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ ఖరా అభిప్రాయపడ్డారు.

టైర్ల కంపెనీలు కుమ్మక్కయ్యాయన్న ఆరోపణలపై తాజా ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కాంపిటిషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ)ను ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశించింది. దేశీయ టైర్ల పరిశ్రమను కాపాడేందుకు జరిమానాలను సమీక్షించాలని అభిప్రాయపడింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలో తమకున్న కేంద్రాల్లో ఐటీ ఎగుమతులు 10-12 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని ఎస్‌టీపీఐ డైరెక్టర్‌ జనరల్‌ అరవింద్‌ కుమార్‌ అంచనా వేశారు.

వచ్చే అయిదేళ్లలో వెస్ట్‌లైఫ్‌ మూడురెట్ల అమ్మకాల వృద్ధిని ఆశిస్తోంది. 2027 నాటికి కొత్తగా 300 మెక్‌డొనాల్డ్స్‌ రెస్టారెంట్‌లను ప్రారంభించాలని భావిస్తోంది.

మెనోపాజ్‌ లక్షణాల తీవ్రతను తగ్గించే ఎస్ట్రాడియల్‌ ట్రాన్స్‌డెర్మాల్‌ సిస్టమ్‌ జనరిక్‌ ఔషధానికి యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి ఇచ్చినట్లు జైడస్‌ లైఫ్‌సైన్సెస్‌ వెల్లడించింది.

ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు 216 బిలియన్‌ డాలర్ల అదనపు బడ్జెట్‌కు జపాన్‌ పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. బలహీన యెన్‌, పెరిగిన జీవనవ్యయాలను అదుపు చేయాలని జపాన్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని