ఎన్‌ఎండీసీ రికార్డు స్థాయి ఉత్పత్తి, అమ్మకాలు

ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ మరోసారి రికార్డు స్థాయి ఉత్పత్తిని నమోదు చేసింది. గత నెలలో  3.61 మిలియన్‌ టన్నుల ఇనుప ఖనిజం ఉత్పత్తి, 3.04 మిలియన్‌ టన్నుల అమ్మకాలు సాధించినట్లు ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ వెల్లడించింది.

Updated : 03 Dec 2022 01:44 IST

ఈనాడు, హైదరాబాద్‌:  ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ మరోసారి రికార్డు స్థాయి ఉత్పత్తిని నమోదు చేసింది. గత నెలలో  3.61 మిలియన్‌ టన్నుల ఇనుప ఖనిజం ఉత్పత్తి, 3.04 మిలియన్‌ టన్నుల అమ్మకాలు సాధించినట్లు ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఉత్పత్తి 8 శాతం, అమ్మకాలు 5.5 శాతం పెరిగాయి. గత మూడు నెలల్లో వరుసగా రికార్డు స్థాయి ఉత్పత్తి, అమ్మకాలను ఎన్‌ఎండీసీ సాధించింది. తత్ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న ఉత్పత్తి, అమ్మకాల లక్ష్యాన్ని సునాయాసంగా అధిగమించే అవకాశం ఏర్పడింది. ఉక్కుకు గిరాకీ పెరిగినందున, ఇనుప ఖనిజం అధిక ఉత్పత్తి- అమ్మకాలు సాధించే అవకాశం కలిగినట్లు ఎన్‌ఎండీసీ సీఎండీ సుమిత్‌ దేబ్‌ వివరించారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు