రూ.1500 కోట్ల ఐపీఓకు న్యూబర్గ్‌ డయాగ్నోస్టిక్స్‌!

పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.1500 కోట్ల నిధులను సమీకరించాలని న్యూబర్గ్‌ డయాగ్నోస్టిక్స్‌ భావిస్తున్నట్లు ఈ పరిణామాలతో సంబంధమున్న వ్యక్తులను ఉటంకిస్తూ ఒక ఆంగ్ల వార్తా పత్రిక పేర్కొంది.

Updated : 03 Dec 2022 01:46 IST

దిల్లీ/ముంబయి: పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.1500 కోట్ల నిధులను సమీకరించాలని న్యూబర్గ్‌ డయాగ్నోస్టిక్స్‌ భావిస్తున్నట్లు ఈ పరిణామాలతో సంబంధమున్న వ్యక్తులను ఉటంకిస్తూ ఒక ఆంగ్ల వార్తా పత్రిక పేర్కొంది. భారత్‌, విదేశాల్లో తన కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ఈ నిధులను ఉపయోగించాలన్నది కంపెనీ ఉద్దేశంగా ఉందని అందులో వివరించింది. ఆరోగ్య రంగ దిగ్గజం జి.ఎస్‌.కె. వేలు ఆధ్వర్యంలోని ఈ కంపెనీ ఇప్పటికే ఐపీఓ నిర్వహణ కోసం కోటక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌లను ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లుగా నియమించుకుందని ఆ వ్యక్తులు పేర్కొన్నారు. దేశంలో ఈ కంపెనీకి 150 లేబొరేటరీలు, 2000కు పైగా కలెక్షన్‌ కేంద్రాలున్నాయి. దక్షిణాఫ్రికా, అమెరికా, యూఏఈల్లోనూ కార్యకలాపాలున్నాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఈ ఆర్థిక సంవత్సరం చివరికి, లేదంటే 2023-24 తొలి త్రైమాసికంలో ఐపీఓకు రావొచ్చని కంపెనీ ఛైర్మన్‌ వేలు సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు