రూ.54,000 పైకి పసిడి ధర

దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల పసడి ధర రూ.473 మేర పెరిగి రూ.54,195కు చేరింది. బలమైన అంతర్జాతీయ పరిణామాలతో గిరాకీ పెరుగుతోందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది.

Published : 03 Dec 2022 01:40 IST

రూ.66,000 పైన కిలో వెండి

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల పసడి ధర రూ.473 మేర పెరిగి రూ.54,195కు చేరింది. బలమైన అంతర్జాతీయ పరిణామాలతో గిరాకీ పెరుగుతోందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. కిలో వెండి రూ.1,216 పెరిగి రూ.66,064కు చేరింది. ‘ద్రవ్యోల్బణం తగ్గుతోన్న సంకేతం, డాలర్‌ సూచీలో బలహీనత, భౌతిక పసిడికి మంచి గిరాకీ ఉండడం వంటివి దేశీయ పసిడి ధరల పెరుగుదలకు మద్దతు ఇస్తున్నాయ’ని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ పరిశోధనా విశ్లేషకులు దిలీప్‌ పర్మార్‌ వెల్లడించారు. అంతర్జాతీయ విపణిలో ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం 1,801.25 డాలర్ల వద్ద, వెండి ఔన్స్‌ 22.73 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని