డేటా భద్రతా బిల్లు నుంచి ప్రారంభస్థాయి అంకురాలకు మినహాయింపు!

ప్రతిపాదిత డిజిటల్‌ వ్యక్తిగత డేటా భద్రతా బిల్లు నిబంధనల నుంచి ‘ప్రారంభ దశలో ఉన్న అంకురాలకు మినహాయింపు ఇవ్వాల’ని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Published : 05 Dec 2022 04:07 IST

దిల్లీ: ప్రతిపాదిత డిజిటల్‌ వ్యక్తిగత డేటా భద్రతా బిల్లు నిబంధనల నుంచి ‘ప్రారంభ దశలో ఉన్న అంకురాలకు మినహాయింపు ఇవ్వాల’ని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ మినహాయింపు పరిమిత కాలం పాటే ఉండే అవకాశం ఉంది. అంకుర సంస్థలు తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకు, వినూత్నత దిశగా సాగేందుకు నిబంధనల భారం పడకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే వీటికి డేటా భద్రతా బిల్లు నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వడానికి ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోందని సమాచారం. అంకుర సంస్థలు తమ నమూనాను అభివృద్ధి చేసుకునే సమయంలోనే పరిమితకాలం పాటు ఈ మినహాయింపు ఉంటుందని సమాచారం. డిసెంబరు 17 వరకు ఈ బిల్లుపై ప్రజలు తమ స్పందనను తెలియజేయొచ్చు. వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో పార్లమెంట్‌ ముందుకు ఈ బిల్లును తీసుకొచ్చే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని