డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్‌కు ‘జాతీయ అవార్డు’
దివ్యాంగులకు విశిష్ఠమైన సేవలు అందిస్తున్నందుకు గాను డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ- డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్‌కు జాతీయ అవార్డు లభించింది.
ఈనాడు, హైదరాబాద్: దివ్యాంగులకు విశిష్ఠమైన సేవలు అందిస్తున్నందుకు గాను డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ- డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్‌కు జాతీయ అవార్డు లభించింది. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి డాక్టర్ రెడ్డీస్ ఛైర్మన్ సతీశ్ రెడ్డి జాతీయ అవార్డును అందుకున్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ 1999లో లైవ్లీహుడ్ అడ్వాన్స్‌మెంట్ బిజినెస్ స్కూల్(ల్యాబ్స్) ద్వారా నైపుణ్యాల శిక్షణ, ఇతర కార్యక్రమాలను ప్రారంభించింది. ఇందులో భాగంగా దివ్యాంగుల ప్రయోజనాలకు చర్యలు చేపట్టింది. 2030 నాటికి డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్‌లోని సిబ్బందిలో 3% మంది దివ్యాంగులకు అవకాశం కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ కార్యక్రమాలను ఇంకా పట్టుదలతో ముందుకు తీసుకువెళ్లేందుకు అవసరమైన స్ఫూర్తిని ఈ జాతీయ అవార్డు ఇస్తుందని డాక్టర్ రెడ్డీస్ పేర్కొంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Earthquake: ఎటుచూసినా శవాల గుట్టలే.. భూకంప మృతులు 9500కు పైనే!
-
World News
Zelensky: హఠాత్తుగా బ్రిటన్ చేరుకొన్న జెలెన్స్కీ.. ఉక్రెయిన్ పైలట్లకు అక్కడ శిక్షణ
-
Movies News
Social Look: టామ్ అండ్ జెర్రీలా అదితి- దుల్కర్.. హెబ్బా పటేల్ లెహంగా అదుర్స్!
-
World News
Earthquake: శిథిలాల కింద తమ్ముడికి ఏం కాకూడదని.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఏడేళ్ల బాలిక ఫొటో
-
General News
Amaravati: విభజన చట్టం ప్రకారం రాజధానిగా అమరావతిని నోటిఫై చేశారు: కేంద్రం
-
Movies News
Amigos: ఆ పాట చూశాక అందరూ షాక్ అవుతారు: కల్యాణ్ రామ్