దూసుకెళ్లనున్న వ్యాపార ప్రకటనల పరిశ్రమ
భారత్‌లో వ్యాపార ప్రకటనల పరిశ్రమ ఆదాయ వృద్ధి ఈ ఏడాది 16.8 శాతం మేర నమోదు కావొచ్చని గ్రూప్ ఎమ్ అనే సంస్థ తన నివేదికలో పేర్కొంది.
2023లో ఆదాయాల్లో 16.8% వృద్ధి
గ్రూప్ ఎమ్ అంచనా
ముంబయి: భారత్‌లో వ్యాపార ప్రకటనల పరిశ్రమ ఆదాయ వృద్ధి ఈ ఏడాది 16.8 శాతం మేర నమోదు కావొచ్చని గ్రూప్ ఎమ్ అనే సంస్థ తన నివేదికలో పేర్కొంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో వ్యాపార ప్రకటనల పరిశ్రమ బలంగా కనిపిస్తోందని.. 2022లో ఇది 15.8% వృద్ధితో 14.9 బిలియన్ డాలర్లకు చేరొచ్చని ఆ సంస్థ అంచనా వేసింది. ఇక వచ్చే ఏడాదిలో డిజిటల్ వ్యాపార ప్రకటనలకు 48.4 శాతం మేర వాటా దక్కవచ్చని పేర్కొంది. ఇంకా ఆ నివేదిక ఏమంటోందంటే..
* 2022లో రిటైల్ మీడియా పరిమాణం 551 మి. డాలర్లుగా నమోదు కావొచ్చు. 2027 కల్లా రెట్టింపునకు చేరొచ్చు.
* మొత్తం వ్యాపార ప్రకటనల్లో 36% వాటా ఉన్న టీవీ వ్యాపార ప్రకటనలు ఈ ఏడాది 10.8 శాతం వృద్ధి చెందొచ్చు. సంప్రదాయ, కనెక్టెడ్ టీవీల్లో బలమైన వృద్ధిని ఇది సాధించవచ్చు.
* చైనాలో కరోనా ఆంక్షల నేపథ్యంలో వ్యాపార ప్రకటనల ఆదాయాలు 2022లో 137.8 బిలియన్ డాలర్లకు చేరొచ్చు. గతేడాదితో పోలిస్తే ఇది 0.6% తక్కువ. 2023లో మాత్రం 6.3% మేర రాణించొచ్చు.
* అంతర్జాతీయంగా చూస్తే వ్యాపార ప్రకటనల వృద్ధి వచ్చే ఏడాది 5.9 శాతానికి పరిమితం కావొచ్చు. ఈ ఏడాది 6.5 శాతం వృద్ధి చెందొచ్చని అంచనా.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Kichcha Sudeep: ఆమె చేసిన త్యాగాల వల్లే నేను ఇక్కడ ఉన్నా: కిచ్చా సుదీప్
-
Sports News
ICC Rankings: కెరీర్లో అత్యుత్తమ రేటింగ్ పాయింట్లను అందుకున్న సూర్యకుమార్
-
India News
UPSC Jobs: యూపీఎస్సీ సివిల్స్ నోటిఫికేషన్ విడుదల.. పోస్టులెన్నంటే?
-
Politics News
Sajjala: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వాయిస్ రికార్డు అయితే, ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు: సజ్జల
-
Politics News
Chandrababu: వైకాపా 31 మంది ఎంపీలు ఏం సాధించారు?: బడ్జెట్‌పై స్పందించిన చంద్రబాబు
-
Sports News
Sports Budget: క్రీడల బడ్జెట్.. పెరిగింది కాస్తే కానీ.. ఇదే అత్యధికం!