ఏక గవాక్ష అనుమతులకు పాన్‌ సంఖ్య

జాతీయ ఏక గవాక్ష వ్యవస్థలో వ్యాపారులు అనుమతులు తీసుకోవడానికి ఇతర డేటా స్థానంలో శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌)ను విశిష్ఠ గుర్తింపుగా అనుమతించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Published : 06 Dec 2022 03:57 IST

వ్యాపారులకు విశిష్ఠ గుర్తింపుగా వినియోగం

దిల్లీ: జాతీయ ఏక గవాక్ష వ్యవస్థలో వ్యాపారులు అనుమతులు తీసుకోవడానికి ఇతర డేటా స్థానంలో శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌)ను విశిష్ఠ గుర్తింపుగా అనుమతించాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు వివిధ రకాల అనుమతులు కోరడానికి ఈ వ్యవస్థను వినియోగిస్తున్నాయి. ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓ, ఈఎస్‌ఐసీ, జీఎస్‌టీఎన్‌, టిన్‌, ట్యాన్‌, పాన్‌ వంటి 13 రకాల వ్యాపార ఐడీలను వేర్వేరు ప్రభుత్వ అనుమతుల దరఖాస్తుల కోసం వాడుతున్నారు. ఈ అంశంపై రెవెన్యూ విభాగాన్ని తమ మంత్రిత్వ శాఖ ఇప్పటికే సంప్రదించినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూశ్‌ గోయల్‌ తెలిపారు. ‘ప్రస్తుత డేటాబేస్‌ల్లో ఒకదాన్ని ప్రవేశానికి వాడనున్నాం. ఇప్పటికే ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నది కావడంతో పాన్‌ సంఖ్యను అందుకు పరిగణిస్తున్నాం. పాన్‌ డేటాబేస్‌లో కంపెనీ, డైరెక్టర్లు, చిరునామాలు, ఇతర సమాచారం ఇప్పటికే ఉంది’ అని గోయల్‌ అన్నారు. వివిధ మంత్రిత్వ శాఖలను అందించే సమాచారంలో ద్వంద్వత్వాన్ని తగ్గించేందుకు, నిబంధనల భారం, ప్రాజెక్టుల అనుమతులకు నిరీక్షణ తగ్గించడం, సులభతర వ్యాపారం వంటి లక్ష్యాల కోసం జాతీయ ఏక గవాక్ష వ్యవస్థ (ఎన్‌ఎస్‌డబ్ల్యూఎస్‌)ను తీసుకొచ్చారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని