శ్రీరామ్‌ ఫైనాన్స్‌ కార్యకలాపాలు ప్రారంభం

శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌, శ్రీరామ్‌ సిటీ యూనియన్‌ ఫైనాన్స్‌, పాత హోల్డింగ్‌ సంస్థ శ్రీరామ్‌ క్యాపిటల్‌ విలీనం తర్వాత ఏర్పాటైన శ్రీరామ్‌ ఫైనాన్స్‌ కార్యకలాపాలు సోమవారం ప్రారంభమయ్యాయి.

Published : 06 Dec 2022 03:57 IST

ముంబయి: శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌, శ్రీరామ్‌ సిటీ యూనియన్‌ ఫైనాన్స్‌, పాత హోల్డింగ్‌ సంస్థ శ్రీరామ్‌ క్యాపిటల్‌ విలీనం తర్వాత ఏర్పాటైన శ్రీరామ్‌ ఫైనాన్స్‌ కార్యకలాపాలు సోమవారం ప్రారంభమయ్యాయి. వాహనయేతర రుణాల వృద్ధిపై దృష్టి పెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ వినియోగ వాహన రుణాలపై ఎక్కువగా ఆధారపడి ఉంది. శ్రీరామ్‌ ఫైనాన్స్‌ మొత్తం రూ.1.71 లక్షల కోట్ల రుణ పుస్తకంలో వాహన రుణాల వాటా 77.5 శాతంగా ఉంది. వచ్చే 2-3 ఏళ్లలో ఈ వాటాను 60 శాతానికి, ఆ తర్వాత అయిదేళ్లలో 50 శాతానికి తగ్గించాలని చూస్తున్నామని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌ ఉమేశ్‌ రేవాంకర్‌, ఎండీ, సీఈఓ వైఎస్‌ చక్రవర్తి పేర్కొన్నారు. కొత్త కంపెనీ చేతిలో 67 లక్షలకు పైగా ఖాతాదారులు ఉండగా.. దేశవ్యాప్తంగా 3,600 పైగా శాఖల నుంచి కార్యకలాపాలు సాగించనుంది. కంపెనీకి 57,000 మంది ఉద్యోగులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు