6 బోయింగ్‌ 777 విమానాలు అద్దెకు తీసుకోనున్న ఎయిరిండియా

ఎయిరిండియా ఆరు వైడ్‌ బాడీ బోయింగ్‌ 777 విమానాలను అద్దెకు తీసుకోనున్నట్లు మంగళవారం వెల్లడించింది. ఈ ఏడాది ప్రారంభంలో 30 విమానాలను అద్దెకు తీసుకోనున్నట్లు కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Published : 06 Dec 2022 03:57 IST

ముంబయి: ఎయిరిండియా ఆరు వైడ్‌ బాడీ బోయింగ్‌ 777 విమానాలను అద్దెకు తీసుకోనున్నట్లు మంగళవారం వెల్లడించింది. ఈ ఏడాది ప్రారంభంలో 30 విమానాలను అద్దెకు తీసుకోనున్నట్లు కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటికి అదనంగా ఈ ఆరు బోయింగ్‌ 777 విమానాలను సంస్థ అద్దెకు తీసుకోనుంది. కాగా.. 12 విమానాలు- ఆరు వైడ్‌ బాడీ బోయింగ్‌ 777- 300ఈఆర్‌, ఆరు నారో బాడీ ఏ320 నియోలను అద్దెకు తీసుకోవాలని నిర్ణయించినట్లు తొలుత సోమవారం ప్రకటించినప్పటికీ.. ఆ తర్వాత ఆరు బోయింగ్‌ 777 విమానాలను మాత్రమే అద్దెకు తీసుకోనున్నట్లు ఆ ప్రకటనలో మార్పు చేసింది. 2023 తొలి అర్ధభాగంలో ఇవి ఎయిరిండియాలోని ప్రస్తుత విమానాలకు కలుస్తాయని పేర్కొంది. మెట్రో నగరాలను మరిన్ని అంతర్జాతీయ మార్గాలకు అనుసంధానం చేసేందుకు బీ777- 300ఈఆర్‌లో నాలుగు క్లాస్‌లు (ఫస్ట్‌, బిజినెస్‌, ప్రీమియమ్‌ ఎకానమీ, ఎకానమీ) ఉంటాయని ఎయిరిండియా పేర్కొంది. అలాగే గత కొన్నాళ్లుగా కార్యకలాపాలను ఆపేసిన 19 విమానాల సేవలను పునరుద్ధరించామని, మరో 9 విమానాలు కూడా త్వరలోనే వీటికి కలుస్తాయని వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని