సంక్షిప్త వార్తలు
ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తమ పాన్ ఇండియా ‘ఫ్యూచర్ రెడీ ఛాంపియన్స్ ఆఫ్ కోడ్’ కార్యక్రమం కింద మన దేశంలోని లక్ష మంది సాఫ్ట్వేర్ డెవలపర్లకు శిక్షణ అందించబోతున్నట్లు మైక్రోసాఫ్ట్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కస్టమర్ సక్సెస్) అపర్ణా గుప్తా వెల్లడించారు.
భారతీయ సాఫ్ట్వేర్ డెవలపర్లకు మైక్రోసాఫ్ట్ శిక్షణ
దిల్లీ: ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తమ పాన్ ఇండియా ‘ఫ్యూచర్ రెడీ ఛాంపియన్స్ ఆఫ్ కోడ్’ కార్యక్రమం కింద మన దేశంలోని లక్ష మంది సాఫ్ట్వేర్ డెవలపర్లకు శిక్షణ అందించబోతున్నట్లు మైక్రోసాఫ్ట్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కస్టమర్ సక్సెస్) అపర్ణా గుప్తా వెల్లడించారు. శిక్షణానంతరం వారికి ధ్రువపత్రాలు అందించనున్నట్లు తెలిపారు. నెల రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమానికి మైక్రోసాఫ్ట్ ఖాతాదార్లు, భాగస్వాములు సహకారం అందిస్తారు. ఇందులో అసెంచర్, హెచ్‌సీఎల్ టెక్, ఇసెర్టిస్, ఇన్ఫోసిస్, ఇన్‌మొబి, ఓయో, పేయు, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఉడాన్, వెర్సె ఇన్నోవేషన్, విబ్మో (ఏ పేయు కంపెనీ), విప్రో తదితర సంస్థలున్నాయి.
టి-హబ్‌తో క్యూఈటీసీఐ ఒప్పందం
ఈనాడు, హైదరాబాద్: క్వాంటమ్ సాంకేతికతలపై పని చేస్తున్న అంకురాలకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు క్వాంటమ్ ఎకోసిస్టమ్స్ టెక్నాలజీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూఈటీసీఐ) ప్రత్యేకంగా టి-హబ్‌తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా ప్రారంభ, అభివృద్ధి దశల్లో ఉన్న అంకురాలు క్వాంటమ్ సాంకేతికత వినియోగించుకునేందుకు తోడ్పడటంతో పాటు, వాటికి దిశానిర్దేశం, వ్యాపార అవకాశాలు, మార్కెట్‌పై అవగాహన లభిస్తాయి. మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ క్వాంటమ్‌ను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఈ ఒప్పందం తోడ్పడుతుందన్నారు. టి-హబ్ సీఈఓ శ్రీనివాస్ రావు మహంకాళి మాట్లాడుతూ క్వాంటమ్ కంప్యూటింగ్‌పై అవగాహన పెంచడం కోసం క్యూఈటీసీఐతో భాగస్వామ్యం ఉపయోగపడుతుందన్నారు. ఇటీవల జరిగిన హ్యాకథాన్‌లో 25 దేశాల నుంచి 132 ఆలోచనలు వచ్చాయని తెలిపారు. జీవశాస్త్రాలు, క్వాంటమ్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగాల్లో ఆసక్తికర ప్రోటోటైప్‌లు వచ్చాయని క్యూఈటీసీఐ ఛైర్పర్సన్ రీనా దయాళ్ తెలిపారు.
స్థిరాస్తిలో ట్రంప్ పెట్టుబడులు పెరగనున్నాయ్!
దిల్లీ: అమెరికాకు చెందిన ద ట్రంప్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ జె. ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఈ నెల భారత సందర్శనకు రావొచ్చని తెలుస్తోంది. భారత స్థిరాస్తి మార్కెట్లో మరిన్ని పెట్టుబడులను ఆయన ప్రకటించే అవకాశం ఉంది. న్యూయార్క్‌కు చెందిన ‘ద ట్రంప్ ఆర్గనైజేషన్’.. ముంబయికి చెందిన ట్రైబెకా డెవలపర్స్‌తో భాగస్వామ్యం ద్వారా భారత స్థిరాస్తి రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ రెండు కంపెనీలు కలిసి లోధా గ్రూప్ వంటి స్థానిక డెవలపర్లతో కలిసి ‘ట్రంప్’ బ్రాండ్ కింద విలాసవంత ప్రాజెక్టులను నిర్మిస్తున్నాయి. ఇప్పటిదాకా నాలుగు ప్రాజెక్టులను ప్రకటించగా.. పుణెలో ఒకటి పూర్తయింది. ‘ట్రైబెకా డెవలపర్స్ 10వ వార్షికోత్సవ సంబరాల దృష్ట్యా ఈ నెలలో ట్రంప్ జూనియర్ భారత్‌కు రావొచ్చ’ని ఆ కంపెనీ పేర్కొంది.
ఐప్యాడ్ ఉత్పత్తి చైనా నుంచి భారత్‌కు!
యోచిస్తున్న యాపిల్
చైనాలో ఐఫోన్ ఉత్పత్తిని తగ్గించి, కొంతమేరకు భారత్‌కు బదిలీ చేసిన యాపిల్ ఇప్పుడు ఐప్యాడ్ ఉత్పత్తినీ ఇదే విధంగా చేయాలని యోచిస్తోందని సమాచారం. ఐప్యాడ్లను కొంత మేర భారత్‌లో ఉత్పత్తి చేసే అంశాన్నీ యాపిల్ పరిశీలిస్తోందని ఒక ఆంగ్ల పత్రిక పేర్కొంది. యాపిల్ తన ఐప్యాడ్ తయారీని వియత్నాంలో మొదలుపెట్టాలని భావిస్తోందని రెండేళ్ల క్రితం వార్తలొచ్చాయి. మళ్లీ ఇప్పుడు తాజా వార్తలు రావడం విశేషం. అయితే ఐప్యాడ్ వంటి సంక్లిష్ట ఉత్పత్తుల తయారీలో నైపుణ్యం ఉన్న సిబ్బందికి భారత్ఓ కొరత ఉండటమే ప్రతికూల అంశమని పేర్కొంది. తయారీ కార్యలాపాలను చైనా నుంచి 30 శాతం మేర ఇతర దేశాలకు తరలించే కార్యాచరణకు యాపిల్ దిగనుందని తెలుస్తోంది. ప్రస్తుతం చైనా, అమెరికా మధ్య వాణిజ్య వివాదాలకు తోడు, చైనాలో కార్మిక వ్యయాలు పెరగడమే ఇందుకు కారణం. చైనా వ్యాప్తంగా కరోనా ఆంక్షలు కఠినతరం చేసిన నేపథ్యంలో ఐఫోన్ 14 తయారీని తగ్గించాల్సి వచ్చింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
North Korea: రూ.13.9వేల కోట్లు కొల్లగొట్టిన కిమ్ ‘జాతిరత్నాలు’..!
-
Latestnews News
IND vs AUS: అశ్విన్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఆసీస్ ‘డూప్లికేట్’ వ్యూహం!
-
India News
Mumbai: ముంబయిలో ఉగ్ర దాడులంటూ ఎన్ఐఏకు బెదిరింపు మెయిల్..!
-
Movies News
Michael Review: రివ్యూ : మైఖేల్
-
Movies News
K.Viswanath: ‘కళా తపస్వి’.. ఆ పదం వినగానే భయం వేసింది!
-
General News
Tamilisai: పెట్టుబడుల స్వర్గధామంగా తెలంగాణ: గవర్నర్ తమిళిసై