గ్యాస్‌ను జీఎస్‌టీలో చేర్చే వరకు సీఎన్‌జీపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలి

పర్యావరణ హిత సహజ వాయువు (సీఎన్‌జీ)ను ఒక దేశం-ఒకే పన్ను (జీఎస్‌టీ) పరిధిలోకి తీసుకొచ్చే వరకు దానిపై విధిస్తున్న దిగుమతి సుంకాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి కిరీట్‌ పారిఖ్‌ కమిటీ సిఫారసు చేసింది.

Published : 07 Dec 2022 03:46 IST

కిరీట్‌ పారిఖ్‌ కమిటీ సిఫారసు

దిల్లీ: పర్యావరణ హిత సహజ వాయువు (సీఎన్‌జీ)ను ఒక దేశం-ఒకే పన్ను (జీఎస్‌టీ) పరిధిలోకి తీసుకొచ్చే వరకు దానిపై విధిస్తున్న దిగుమతి సుంకాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి కిరీట్‌ పారిఖ్‌ కమిటీ సిఫారసు చేసింది. సహజ వాయువును జీఎస్‌టీలో చేర్చనందున, కేంద్ర దిగుమతి సుంకం, రాష్ట్రాలు వ్యాట్‌ (విలువ జోడింపు పన్ను), కేంద్ర విక్రయాల పన్నుల వంటివి విధిస్తున్నాయి. సహజ వాయువును గ్యాస్‌ రూపంలో విక్రయించినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాన్ని విధించదు. కానీ కంప్రెష్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ) రూపంలో విక్రయిస్తే 14 శాతం పన్ను విధిస్తోంది. అలాగే రాష్ట్రాలు అధికంగా 24.5 శాతం వ్యాట్‌ వసూలు చేస్తున్నాయి. వినియోగదార్లకు సరైన ధరకు గ్యాస్‌ను అందించేందుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు నియమించిన పారిఖ్‌ కమిటీ, నివేదికను గత వారం చమురు మంత్రిత్వ శాఖకు అందజేసింది. అందులో గ్యాస్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాల్సిందిగా సూచించింది.

2017 జులై 1 నుంచి జీఎస్‌టీ అమల్లోకి వచ్చింది. ముడి చమురు, పెట్రోల్‌, డీజిల్‌, ఏటీఎఫ్‌ (విమాన ఇంధనం)లను మాత్రం దీని పరిధిలోకి తీసుకురాలేదు. గుజరాత్‌ వంటి గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు వ్యాట్‌, ఇతర పన్నుల రూపంలో అందుకుంటున్న తమ ఆదాయాన్ని కోల్పోతామని భయపడుతున్నాయి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు