స్విట్జర్లాండ్‌లో ఈవీలపై ఆంక్షలు

స్విట్జర్లాండ్‌.. చాక్లెట్లు, గడియారాలు, తక్కువ పన్నులకు ప్రసిద్ధి చెందిన ఈ దేశం విద్యుత్తు వినియోగంపై గట్టి ఆంక్షలను పెట్టాలని చూస్తోంది. దేశం చీకట్లో మగ్గిపోకుండా, విద్యుత్తు కోతలకు అవకాశం లేకుండా చూసేందుకు పలు చర్యలు చేపట్టాలని భావిస్తోందని వార్తా సంస్థ ‘ద టెలిగ్రాఫ్‌’ ఒక కథనంలో పేర్కొంది.

Published : 07 Dec 2022 03:46 IST

అత్యవసర ప్రయాణాలకే పరిమితం
విద్యుత్తు కొరత వల్లే

స్విట్జర్లాండ్‌.. చాక్లెట్లు, గడియారాలు, తక్కువ పన్నులకు ప్రసిద్ధి చెందిన ఈ దేశం విద్యుత్తు వినియోగంపై గట్టి ఆంక్షలను పెట్టాలని చూస్తోంది. దేశం చీకట్లో మగ్గిపోకుండా, విద్యుత్తు కోతలకు అవకాశం లేకుండా చూసేందుకు పలు చర్యలు చేపట్టాలని భావిస్తోందని వార్తా సంస్థ ‘ద టెలిగ్రాఫ్‌’ ఒక కథనంలో పేర్కొంది. వేడుకలు, థియేటర్‌ ప్రదర్శనలు, క్రీడా కార్యక్రమాలపై నిషేధం విధించాలనుకుంటోంది. అలాగే విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని కేవలం అత్యవసర ప్రయాణాలకే పరిమితం చేయాలనీ ఆదేశించే అవకాశం ఉంది. ఇంకా క్రిప్టోకరెన్సీ మైనింగ్‌ను, ఎస్కలేటర్లను నిలిపివేయాలనీ చూస్తోంది. ఈ చర్యలన్నిటితో కూడిన ఒక ముసాయిదా ప్రతిపాదనను అధికారులు సిద్ధం చేశారని తెలుస్తోంది. ఇదే జరిగితే ఈవీలపై ఆంక్షలు విధించిన తొలి దేశం ఇదే అవుతుంది.
స్విట్జర్లాండ్‌ తన విద్యుత్‌ అవసరాలకు ప్రధానంగా జల విద్యుత్‌పైనే ఆధారపడి ఉంది. దేశ విద్యుత్‌లో 60 శాతం ఈ మార్గం నుంచే వస్తోంది. అయితే శీతకాలంలో ఉత్పత్తి మందగించింది. పొరుగు దేశాలైన ఫ్రాన్స్‌, జర్మనీల నుంచి విద్యుత్‌ను తీసుకుంటోంది. ఈ రెండూ కూడా ఐరోపాలోని మిగతా దేశాల మాదిరిగానే ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఫ్రాన్స్‌లో విద్యుదుత్పత్తి 30 ఏళ్ల కనిష్ఠానికి చేరింది. ఐరోపా ఇంధన సంక్షోభంలో ఫ్రాన్స్‌ మరీ చిగురుటాకులా వణికిపోతోంది. రష్యాపై ఆధారపడ్డ ఐరోపా దేశాలన్నీ ఇపుడు వివిధ దేశాల వైపు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సింగపూర్‌ కఠిన చర్యలకు దిగుతోంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని