సీమెన్స్‌కు 1,200 విద్యుత్‌ రైలు ఇంజిన్ల తయారీ ఆర్డర్‌

ఇంజినీరింగ్‌ సంస్థ సీమెన్స్‌.. 9,000 హెచ్‌పీ సామర్థ్యంతో 1,200 విద్యుత్‌ లోకోమోటివ్స్‌ (రైలు ఇంజిన్ల) తయారీ ఆర్డరును దక్కించుకుంది.

Published : 07 Dec 2022 03:46 IST

దిల్లీ: ఇంజినీరింగ్‌ సంస్థ సీమెన్స్‌.. 9,000 హెచ్‌పీ సామర్థ్యంతో 1,200 విద్యుత్‌ లోకోమోటివ్స్‌ (రైలు ఇంజిన్ల) తయారీ ఆర్డరును దక్కించుకుంది. ఈ కాంట్రాక్టు విలువ రూ.20,000 కోట్లకు పైగానే. గుజరాత్‌లోని దాహోద్‌లో 9,000 హెచ్‌పీ లోకోమోటివ్స్‌ తయారీ, నిర్వహణ ప్రాజెక్టుకు భారతీయ రైల్వేలు ఈ ఏడాది ఏప్రిల్‌లో టెండర్లు ఆహ్వానించగా, సీమెన్స్‌ లిమిటెడ్‌ అతి తక్కువ ధరకు బిడ్‌ దాఖలు చేసి కాంట్రాక్ట్‌ దక్కించుకున్నట్లు బీఎస్‌ఈకి సమాచారమిచ్చింది. దాహోద్‌ ప్లాంట్‌లో 2023-24 నుంచి 2033-34 వరకు పదేళ్లలో ఈ 1,200 విద్యుత్‌ లోకోమోటివ్స్‌ను తయారు చేయనుంది. తొలి ఏడాది 5, రెండో ఏడాది 35, మూడు, నాలుగు ఏడాదుల్లో 80 చొప్పున, 5, 6 ఏడాదుల్లో 100 చొప్పున, ఆ తర్వాత అయిదేళ్ల పాటు ఏడాదికి 160 లోకోమోటివ్స్‌ చొప్పున సీమెన్స్‌ సరఫరా చేయనుంది. 10,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను ఈ ప్రాజెక్ట్‌ కల్పించబోతోంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు