ఎన్‌ఎఫ్‌సీఎల్‌ యూరియా ప్లాంటు మూసివేత

నాగార్జునా ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎఫ్‌సీఎల్‌) కు చెందిన యూరియా ప్లాంటులో ఉత్పత్తి నిలిచిపోయింది.

Published : 07 Dec 2022 03:46 IST

ఈనాడు, హైదరాబాద్‌: నాగార్జునా ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎఫ్‌సీఎల్‌) కు చెందిన యూరియా ప్లాంటులో ఉత్పత్తి నిలిచిపోయింది. కాకినాడలోని ప్లాంటు- 2 ను తాత్కాలికంగా మూసివేసినట్లు ఎన్‌ఎఫ్‌సీఎల్‌ వెల్లడించింది. ఇందుకు కారణాలు తెలుపలేదు. ఇదిలా ఉంటే, ఎన్‌ఎఫ్‌సీఎల్‌కు ఇచ్చిన అప్పులను విక్రయానికి పెట్టిన ఐడీబీఐ బ్యాంకు, దీనికి ఇచ్చిన తుది గడువును పొడిగించింది. తొలుత జారీ చేసిన ప్రకటన ప్రకారం ఆసక్తి గల కొనుగోలుదార్లు తమ బిడ్లు దాఖలు చేయడానికి ఈ నెల 3 వరకే గడువుంది. అదే రోజున బిడ్లను తెరిచి, పరిశీలించాలని నిర్దేశించుకున్నారు. కానీ ఇప్పుడు బిడ్లు దాఖలు చేయడానికి గడువును ఈ నెల 13 వరకు పొడిగించారు. అదే రోజున బిడ్లు తెరిచి పరిశీలిస్తారు. దాఖలైన బిడ్లలో మొదటి మూడు స్థానాల్లో ఉన్న సంస్థలకు, ఆ మరుసటి రోజున మళ్లీ అవకాశం ఇచ్చి విజేతను ఖరారు చేస్తారు. ఈ మార్పులను ఐడీబీఐ బ్యాంకు తాజాగా వెల్లడించింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని