ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇ-ఎఫ్‌ఎంతో రేడియో సిటీ ఒప్పందం

ఎఫ్‌ఎం రేడియో నెట్‌వర్క్‌ సేవల సంస్థ అయిన, ‘రేడియో సిటీ’, రామోజీ గ్రూపునకు చెందిన ‘ఈనాడు ఇ-ఎఫ్‌ఎం’తో వ్యూహాత్మక విక్రయాల భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.

Published : 07 Dec 2022 03:59 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎఫ్‌ఎం రేడియో నెట్‌వర్క్‌ సేవల సంస్థ అయిన, ‘రేడియో సిటీ’, రామోజీ గ్రూపునకు చెందిన ‘ఈనాడు ఇ-ఎఫ్‌ఎం’తో వ్యూహాత్మక విక్రయాల భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మార్కెట్‌కు ఈ ఒప్పందం వర్తిస్తుందని రేడియో సిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. దీనివల్ల ఈ రెండు రాష్ట్రాల్లో రేడియో సిటీ నెట్‌వర్క్‌ పరిధిలో 6 ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లు ఉన్నట్లు అవుతుంది. తద్వారా అతిపెద్ద ప్రాంతీయ ఎఫ్‌ఎం నెట్‌వర్క్‌గా నిలిచే అవకాశం తనకు లభిస్తుందని రేడియో సిటీ వెల్లడించింది. ఇ-ఎఫ్‌ఎం అందించే ఉషోదయం, ఇ-మార్నింగ్స్‌, మాయా బజార్‌, సత్యభామ, లైట్‌ తీస్కో వంటి వినూత్న రేడియో కార్యక్రమాలు ఎంతగానో ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. ఈ ఒప్పందం వల్ల తాము ఎక్కువ మంది శ్రోతలకు దగ్గర కాగలుగుతామని రేడియో సిటీ సీఈఓ అక్షిత్‌ కుకెయిన్‌ అన్నారు. విక్రయాలకు సంబంధించి రేడియో సిటీతో కుదుర్చుకున్న  ఒప్పందం వల్ల శ్రోతల సంఖ్యను పెంచుకునేందుకు తమకు అవకాశం లభిస్తుందని ఇ-ఎఫ్‌ఎం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కె.బాపినీడు పేర్కొన్నారు. రేడియో ఎంతో విశ్వసనీయ మాధ్యమమని ఈ సందర్భంగా ఆయన వివరించారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు