విపత్తు పరిస్థితుల్లో పంపే ఎస్‌ఎమ్‌ఎస్‌లపై ఛార్జీలుండవు: ట్రాయ్‌

విపత్తు నిర్వహణ చట్టం(డీఎమ్‌ఏ) కింద విపత్తు పరిస్థితుల్లో కామన్‌ అలర్ట్‌ ప్రోటోకాల్‌(సీఏపీ) ద్వారా పంపే సంక్షిప్త సందేశాల(ఎస్‌ఎమ్‌ఎస్‌)కు టర్మినేషన్‌ చార్జీ అయిన 2 పైసలు వర్తించదని టెలికాం నియంత్రణాధికార సంస్థ ట్రాయ్‌ పేర్కొంది.

Published : 07 Dec 2022 03:59 IST

దిల్లీ: విపత్తు నిర్వహణ చట్టం(డీఎమ్‌ఏ) కింద విపత్తు పరిస్థితుల్లో కామన్‌ అలర్ట్‌ ప్రోటోకాల్‌(సీఏపీ) ద్వారా పంపే సంక్షిప్త సందేశాల(ఎస్‌ఎమ్‌ఎస్‌)కు టర్మినేషన్‌ చార్జీ అయిన 2 పైసలు వర్తించదని టెలికాం నియంత్రణాధికార సంస్థ ట్రాయ్‌ పేర్కొంది. ఒక వేళ విపత్తు నిర్వహణ చట్టం నుంచి ఎటువంటి ఆదేశాలు లేకుండా విపత్తు, విపత్తేతర పరిస్థితుల్లో సీఏపీ ద్వారా పంపించే ఎస్‌ఎమ్‌ఎస్‌లపై మాత్రం టెలికాం ఆపరేటర్లు (ఎవరి నెట్‌వర్క్‌ ద్వారా పంపుతారో వారు) 2 పైసల టర్మినేషన్‌ ఛార్జీలు వసూలు చేసుకోవచ్చు. అయితే ట్రాయ్‌ జారీ చేసిన టెలికాం టారిఫ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ 2022లో చేసిన 69వ సవరణ ప్రకారం.. ఎంపిక చేసిన మొబైల్‌ టవర్‌కు అనుసంధానమై ఉన్న అన్ని పరికరాల నుంచి సెల్‌ బ్రాడ్‌క్యాస్ట్‌ సిస్టమ్‌(సీబీఎస్‌) ద్వారా పంపే ఎస్‌ఎమ్‌ఎస్‌లకు మాత్రం ఎటువంటి టర్మినేషన్‌ ఉండదు. సీఏపీని ప్రభుత్వ రంగ టెలికాం పరిశోధన సంస్థ అయిన సి-డాట్‌ అభివృద్ధి చేసింది. దీని ద్వారా హెచ్చరికలు పంపడం కోసం స్థానిక ప్రాంతాలను మ్యాప్‌లో మార్క్‌ చేస్తారు. తొలి దశ సీఏపీ కింద హెచ్చరికలు పంపడానికి రేడియో స్టేషన్‌, డీటీహెచ్‌ ప్లేయర్‌, రైల్వే స్టేషన్లను అనుసంధానించారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు