సీట్‌బెల్ట్‌ లోపాలు సరిచేసేందుకు 9,125 కార్లు వెనక్కి: మారుతీ

మారుతీ సుజుకీ ఇండియా తన సియాజ్‌, బ్రెజా, ఎర్టిగా, ఎక్స్‌ఎల్‌6 మోడళ్లకు సంబంధించి 9,125 కార్లను వెనక్కి రప్పిస్తోంది.

Published : 07 Dec 2022 03:59 IST

దిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా తన సియాజ్‌, బ్రెజా, ఎర్టిగా, ఎక్స్‌ఎల్‌6 మోడళ్లకు సంబంధించి 9,125 కార్లను వెనక్కి రప్పిస్తోంది. ముందు వరుస సీటు బెల్టు అడ్జస్టర్‌లో లోపాలను సరిదిద్దేందుకే ఈ కార్లను వెనక్కి రప్పిస్తున్నామని మంగళవారం కంపెనీ తెలిపింది. 2022 నవంబరు 2 నుంచి 28 మధ్య ఈ కార్లు తయారయ్యాయని పేర్కొంది. ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా మరమ్మతు చేసి ఇస్తామని పేర్కొంది. దీనికి సంబంధించి వాహన యజమానులకు కంపెనీ అధీకృత వర్క్‌షాప్‌ల నుంచి సమాచారం పంపిస్తున్నట్లు వివరించింది.

994 అర్బన్‌ క్రూయిజర్‌ హైరైడర్‌ వాహనాలు..  టయోటా: టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ ఈ ఏడాది జులైలో విడుదల చేసిన మధ్యతరహా స్పోర్ట్‌ వినియోగ వాహనం అర్బన్‌ క్రూయిజర్‌ హైరైడర్‌ మోడల్‌కు సంబంధించి 994 వాహనాలను వెనక్కి రప్పిస్తోంది. ముందు సీటు బెల్ట్‌ అడ్జస్టర్‌ ప్లేట్‌ లోపాన్ని సరిదిద్దేందుకు స్వచ్ఛందంగా ఈ వాహనాలను రీకాల్‌ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. వినియోగదారుల భద్రత, సంతృప్తికి కంపెనీ కట్టుబడి ఉందని చెప్పడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. సీటు బెల్టు లోపానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదైతే తమకు అందలేదని వివరించింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు