మూడో రోజూ సూచీలు డీలా
ప్రతికూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో వరుసగా మూడో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ డీలాపడ్డాయి. ఐటీ, లోహ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి.
సమీక్ష
ప్రతికూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో వరుసగా మూడో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ డీలాపడ్డాయి. ఐటీ, లోహ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. చమురు ధరలు పరుగులు తీయడం, రూపాయి క్షీణత సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. బ్యారెల్ ముడిచమురు ధర 0.68 శాతం పెరిగి 83.24 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 65 పైసలు తగ్గి నెల కనిష్ఠమైన 82.50 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లలో సియోల్, హాంకాంగ్ నష్టపోగా, టోక్యో, షాంఘై లాభపడ్డాయి. ఐరోపా సూచీలు బలహీనంగా కదలాడాయి.
సెన్సెక్స్ ఉదయం 62,395.55 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. అనంతరం కోలుకున్న సూచీ నష్టాలు తగ్గించుకుని.. ఒకదశలో 62,677.84 పాయింట్లకు చేరింది. చివరకు 208.24 పాయింట్ల నష్టంతో 62,626.36 వద్ద ముగిసింది. నిఫ్టీ 58.30 పాయింట్లు తగ్గి 18,642.75 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 18,577.90- 18,654.90 పాయింట్ల మధ్య కదలాడింది.
* సెన్సెక్స్ 30 షేర్లలో 15 నీరసించాయి. టాటా స్టీల్ 2.50%, డాక్టర్ రెడ్డీస్ 2.35%, ఎస్బీఐ 1.32%, భారతీ ఎయిర్టెల్ 1.27%, ఐసీఐసీఐ బ్యాంక్ 1.26%, టీసీఎస్ 1.19%, టెక్ మహీంద్రా 1%, హెచ్‌సీఎల్ టెక్ 0.91% చొప్పున డీలాపడ్డాయి. హెచ్‌యూఎల్ 1.31%, నెస్లే 0.75%, పవర్‌గ్రిడ్ 0.74%, అల్ట్రాటెక్ 0.68% రాణించాయి. రంగాల వారీ సూచీల్లో లోహ 1.68%, టెక్ 1.37%, ఐటీ 1.36%, టెలికాం 1.07%, స్థిరాస్తి 0.73%, మన్నికైన వినిమయ వస్తువులు 0.54% పడ్డాయి. ఇంధన, ఎఫ్ఎమ్సీజీ, యుటిలిటీస్, విద్యుత్ మెరిశాయి. బీఎస్ఈలో 1936 షేర్లు నష్టాల్లో ముగియగా, 1563 స్క్రిప్‌లు లాభపడ్డాయి. 133 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
వైభవ్ జువెలర్స్ ఐపీఓకు సెబీ పచ్చజెండా: విశాఖపట్నం కేంద్రంగా పనిచేసే పసిడి ఆభరణాల సంస్థ ‘వైభవ్ జెమ్స్ ఎన్ జువెలర్స్’ ఐపీఓకు సెబీ ఆమోదం తెలిపింది. ఇష్యూలో భాగంగా రూ.210 కోట్ల విలువైన తాజా షేర్లను, ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో 43 లక్షల ఈక్విటీ షేర్లను ప్రమోటర్ సంస్థకు చెందిన గ్రంధి భారత మల్లిక రత్నకుమారి (హెచ్‌యూఎఫ్) విక్రయించనున్నారు.. దీంతో పాటు రేర్ ఎంటర్ప్రైజెస్ పెట్టుబడులు ఉన్న కాంకర్డ్ బయోటెక్ ఐపీఓకు సైతం సెబీ అనుమతి ఇచ్చింది.
* ఓపెన్ ఆఫర్ ద్వారా ఎన్డీటీవీలో మరో 8.26 శాతం వాటాను అదానీ ఎంటర్ప్రైజెస్ కొనుగోలు చేసింది. మొత్తం ఓపెన్ ఆఫర్ పరిమాణంలో దాదాపు 32 శాతానికి సమానమైన 53.2 లక్షల షేర్లకు మాత్రమే మదుపర్లు టెండర్ వేశారు. సోమవారం ముగిసిన ఈ ఆఫర్ తర్వాత 37.44 శాతం వాటాతో ఎన్డీటీవీలో అతిపెద్ద వాటాదారుగా అదానీ ఎంటర్ప్రైజెస్ అవతరించింది. ఎన్డీటీవీ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌ల మొత్తం వాటా 32.26 శాతాన్ని అదానీ అధిగమించింది.
* కంపెనీ బోర్డులో ముగ్గురు కొత్త స్వతంత్ర డైరెక్టర్లను నియమించినట్లు డిష్ టీవీ వెల్లడించింది. ఇదే సమయంలో బోర్డుకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ కుమార్ దాల్మియా రాజీనామా చేశారు. డిష్‌టీవీ డిసెంబరు 29న వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) నిర్వహించనుంది.
* మొబైల్ టవర్ల వెండర్ ఏటీసీ టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రూ.1600 కోట్ల డిబెంచర్ల జారీ ప్రతిపాదనకు కాలం ముగిసినట్లు వొడాఫోన్ ఐడియా తెలిపింది. వడ్డీ బకాయిలను ఈక్విటీగా మార్చడంపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడమే ఇందుకు కారణమని వెల్లడించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Kotamreddy: సజ్జల గుర్తుపెట్టుకో.. నాకు ఫోన్‌కాల్స్ వస్తే మీకు వీడియో కాల్స్ వస్తాయ్: కోటంరెడ్డి
-
Sports News
IND vs AUS: ఆస్ట్రేలియా జట్టులో కంగారు మొదలైంది..: మహమ్మద్ కైఫ్
-
Movies News
Sameera Reddy: మహేశ్‌బాబు సినిమా ఆడిషన్.. ఏడ్చుకుంటూ వచ్చేశా: సమీరారెడ్డి
-
India News
ఘోరం.. వ్యాధి తగ్గాలని 3 నెలల చిన్నారికి 51 సార్లు కాల్చి వాతలు..!
-
Movies News
OTT Movies: డిజిటల్ తెరపై మెరవనున్న బాలీవుడ్ తారలు
-
Politics News
Bhuma Akhila Priya: ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. భూమా అఖిలప్రియ గృహ నిర్బంధం