సంక్షిప్త వార్తలు (3)

క్లౌడ్‌ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే సంస్థలకు లాభదాయకత పెంపొందించేందుకు ఉద్దేశించిన ‘క్లౌడ్‌ బ్లేజ్‌టెక్‌’ అనే నూతన ప్లాట్‌ఫామ్‌ను టెక్‌ మహీంద్రా ఆవిష్కరించింది.

Published : 08 Dec 2022 02:38 IST

టెక్‌ మహీంద్రా నుంచి నూతన ‘క్లౌడ్‌’ పరిజ్ఞానం  

ఈనాడు, హైదరాబాద్‌: క్లౌడ్‌ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే సంస్థలకు లాభదాయకత పెంపొందించేందుకు ఉద్దేశించిన ‘క్లౌడ్‌ బ్లేజ్‌టెక్‌’ అనే నూతన ప్లాట్‌ఫామ్‌ను టెక్‌ మహీంద్రా ఆవిష్కరించింది. దీన్ని అందిపుచ్చుకోవడం ద్వారా వ్యాపార సంస్థలు 25- 30 శాతం మేర ఖర్చులు తగ్గించుకోవచ్చని, ‘మైగ్రేషన్‌ టైమ్‌’ 30 శాతం మెరుగుపడుతుందని టెక్‌మహీంద్రా వివరించింది. అత్యున్నత డిజిట్‌ సొల్యూషన్లు అందించాలనే లక్ష్యంతో ‘క్లౌడ్‌ బ్లేజ్‌టెక్‌’ ను తీసుకువచ్చినట్లు టెక్‌ మహీంద్రా గ్లోబల్‌ హెడ్‌ (క్లౌడ్‌ సర్వీసెస్‌) సూరి చావ్లా తెలిపారు.


హైదరాబాద్‌లో కోరమ్‌ కో-వర్కింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రీమియం కో-వర్కింగ్‌ సేవలను అందించే కోరమ్‌ హైదరాబాద్‌లో 110 సీట్ల సామర్థ్యంతో కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. పనితోపాటు, వినోదమూ అందుబాటులో ఉండేలా ఇది ఉండనుంది. 70వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న దీనికోసం రూ.35 కోట్ల మేరకు పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ సీఈఓ, వ్యవస్థాపకుడు వివేక్‌ నరేన్‌ తెలిపారు. మార్చి నాటికి ఇది అందుబాటులోకి రానుంది. బెంగళూరు, గోవా, దిల్లీలకూ విస్తరించబోతున్నట్లు వెల్లడించారు.


వేదాంతులో మరో 385 ఉద్యోగాల కోత

దిల్లీ: ఎడ్‌టెక్‌ సంస్థ వేదాంతు మరో 385 మంది ఉద్యోగులను తొలగించింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఉద్యోగాల కోతను సంస్థ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే, ఆగస్టుల్లో 620 మందికి పైగా తొలగించగా, తాజా చర్యతో మొత్తం 1000 మంది ఉద్యోగులను తీసేసినట్లు అయ్యింది. అన్ని విభాగాల్లోనూ తొలగింపులున్నాయని, లెర్నింగ్‌ కంటెంట్‌, హెచ్‌ఆర్‌, అమ్మకాల బృందాలపై ఎక్కువ ప్రభావం పడిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని