అనవసర వస్తువుల దిగుమతుల కట్టడి!

తప్పనిసరి కాని వస్తువుల దిగుమతులూ పెరుగుతున్నందున, వీటి కట్టడికి ప్రభుత్వం సరైన మార్గాలను అన్వేషిస్తోంది. దేశ ఎగుమతులకు మద్దతు ఇవ్వడంతో పాటు వాణిజ్య లోటును తగ్గించేందుకోసం ఈ చర్యలు తీసుకుంటోందని ఒక అధికారి పేర్కొన్నారు.

Published : 08 Dec 2022 02:40 IST

మార్గాన్వేషణలో ప్రభుత్వం

దిల్లీ: తప్పనిసరి కాని వస్తువుల దిగుమతులూ పెరుగుతున్నందున, వీటి కట్టడికి ప్రభుత్వం సరైన మార్గాలను అన్వేషిస్తోంది. దేశ ఎగుమతులకు మద్దతు ఇవ్వడంతో పాటు వాణిజ్య లోటును తగ్గించేందుకోసం ఈ చర్యలు తీసుకుంటోందని ఒక అధికారి పేర్కొన్నారు. ఇప్పటికే కట్టడి చేయాల్సిన ఉత్పత్తులను వాణిజ్య మంత్రిత్వ శాఖ గుర్తించిందని; వీటి దిగుమతులను తగ్గించడానికి ప్రత్యామ్నాయ చర్యలపై పనిచేయాల్సిందిగా సమాచారం ఇచ్చిందని ఆ అధికారి వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-అక్టోబరులో దిగుమతులు 436.81 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. కిందటేడాది ఇదే సమయంలో దిగుమతుల విలువ 328.14 బి. డాలర్లు మాత్రమే. ఇదే సమయంలో వాణిజ్య లోటు 94.16 బిలియన్‌ డాలర్ల నుంచి 173.46 బి. డాలర్లకు పెరిగింది. ‘దిగుమతులు, ఎగుమతుల ధోరణిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని వాణిజ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వివిధ మంత్రిత్వశాఖలు, పరిశ్రమ సంఘాలు, ఎగుమతి ప్రోత్సాహక మండళ్లు, వాణిజ్య నిపుణులు, ఇతరత్రా వాటాదార్ల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నాం. అవసరమైన చర్యలను తీసుకుంటున్నామ’ని మరో అధికారి పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు