మాస్‌చిప్‌ ఇన్‌స్టిట్యూట్‌ శిక్షణ కేంద్రం

వీఎల్‌ఎస్‌ఐ, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌లో శిక్షణ ఇచ్చే మాస్‌చిప్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సిలికాన్‌ సిస్టమ్స్‌ హైదరాబాద్‌లో అధునాతన కేంద్రాన్ని ప్రారంభించింది.

Published : 08 Dec 2022 02:41 IST

ఈనాడు, హైదరాబాద్‌: వీఎల్‌ఎస్‌ఐ, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌లో శిక్షణ ఇచ్చే మాస్‌చిప్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సిలికాన్‌ సిస్టమ్స్‌ హైదరాబాద్‌లో అధునాతన కేంద్రాన్ని ప్రారంభించింది. సెమీకండక్టర్ల తయారీ సంస్థ మాస్‌చిప్‌ టెక్నాలజీస్‌కు ఇది పూర్తిస్థాయి అనుబంధ సంస్థ. రాయదుర్గం నాలెడ్జ్‌సిటీలోని అరబిందో గెలాక్సీలో 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పిన తాజా కేంద్రంలో ఫిజికల్‌ డిజైన్‌, అనలాగ్‌ లేఔట్‌, డిజైన్‌ వెరిఫికేషన్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌లో ఏటా 600 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. అధునాతన శిక్షణ కోసం ఈడీఏ టూల్‌ ప్రొవైడర్‌ కాడెన్స్‌ డిజైన్‌ సిస్టమ్స్‌తో ఒప్పందం చేసుకున్నామని మాస్‌చిప్‌ ఎండీ, సీఈఓ వెంకట సింహాద్రి బుధవారం ఇక్కడ చెప్పారు. 2011 నుంచి తమ వద్ద శిక్షణ పొందిన వేలమంది ప్రపంచంలోని వివిధ సెమీకండక్టర్‌ కంపెనీల్లో పనిచేస్తున్నారని వివరించారు. ఈ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ప్రారంభించారు. కాడెన్స్‌ నుంచి జయశంకర్‌, యూఎస్‌కాన్సులేట్‌ ప్రిన్సిపల్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ ఆండ్రు ఎడెల్‌సెన్‌, ఏఎండీ వైస్‌ ప్రెసిడెంట్‌ డేవిడ్‌ నాల్‌ పాల్గొన్నారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని