షియోమీ ఇండియా సీబీఓ రఘు రెడ్డి రాజీనామా

చైనా మొబైల్‌ కంపెనీ షియోమీ అనుబంధ షియోమీ ఇండియా చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌(సీబీఓ) రఘు రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.

Published : 08 Dec 2022 02:43 IST

దిల్లీ: చైనా మొబైల్‌ కంపెనీ షియోమీ అనుబంధ షియోమీ ఇండియా చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌(సీబీఓ) రఘు రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. భారత స్మార్ట్‌ఫోన్‌, స్మార్ట్‌ టీవీ మార్కెట్లలో కంపెనీని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ఈయన కృషి చేశారు. ‘కంపెనీకి వెలుపల ఇతరత్రా వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడాని’కి ఆయన రాజీనామా చేసినట్లు షియోమీ ఇండియా బుధవారం ప్రకటించింది. ‘భారత నాయకత్వ బృందంలో రఘు భాగం కావడం మాకు గర్వకారణ. స్మార్ట్‌ఫోన్‌ విపణిలో షియోమీని అగ్రపథాన నిలబెట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించార’ని పేర్కొంది. ఇదే కంపెనీలో ఆరేళ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేసిన రఘు రెడ్డి 2020లో సీబీఓగా పదోన్నతి పొందారు. విప్రోలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా వృత్తి జీవితం మొదలుపెట్టిన ఈయన ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌లో సీనియర్‌ కన్సల్టెంట్‌గా; ఆ తర్వాత స్నాప్‌ డీల్‌లో సీనియర్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు