అంతర్జాతీయ క్యాప్టివ్ కేంద్రాల్లో 3.64 లక్షల కొత్త ఉద్యోగాలు
అంతర్జాతీయ క్యాప్టివ్ కేంద్రాలు (జీసీసీలు) ఉద్యోగులను పెంచుకోవడానికి చూస్తున్నాయి.
ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్ నివేదిక
దిల్లీ: అంతర్జాతీయ క్యాప్టివ్ కేంద్రాలు (జీసీసీలు) ఉద్యోగులను పెంచుకోవడానికి చూస్తున్నాయి. వచ్చే 12 నెలల్లో ఇవి దాదాపు 3.64 లక్షల మంది ఉద్యోగులను చేర్చుకోవచ్చని ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్ ఇండియా క్యాప్టివేటింగ్ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం 35.9 బిలియన్ డాలర్లుగా ఉన్న జీసీసీ రంగం.. 2026 నాటికి 60- 85 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందొచ్చని అంచనా వేసింది. కీలక అంతర్జాతీయ విపణుల నుంచి సేవలకు గిరాకీ (34 శాతం) పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. ఐటీ సాఫ్ట్‌వేర్, కన్సల్టింగ్ (33 శాతం), బీఎఫ్‌ఎస్‌ఐ (21 శాతం), ఇంటర్నెట్, టెలికాం (16 శాతం) నుంచి ఉద్యోగాలకు గిరాకీ వస్తోంది. ఉద్యోగాల సృష్టి పరంగా బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. అంతర్జాతీయ జీసీసీల కార్యకలాపాల్లో భారత్ వాటా దాదాపు 45 శాతంగా ఉందని, భవిష్యత్‌లో ఇది మరింత పెరగొచ్చని ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్ సీఈఓ సచిన్ అలుగ్ తెలిపారు. 2023లో ఉద్యోగాల్లో ఈ రంగం 10.8 శాతం వార్షిక సమ్మిళిత వృద్ధి (సీఏజీఆర్) నమోదు చేయొచ్చని అన్నారు. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ ఎన్‌సీఆర్, హైదరాబాద్, కోల్‌కతా, ముంబయి, పుణెలకు చెందిన 211 జీసీసీ కంపెనీలపై ఈ సర్వే చేశారు. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్‌ఎస్‌ఐ), ఔషధ, టెలికాం, ఐటీ, తయారీ, చమురు-గ్యాస్, రిటైల్ రంగాల కంపెనీలు ఇందులో ఉన్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Virat Kohli: లతాజీని కలిసి మాట్లాడలేకపోయా..!: విరాట్ కోహ్లీ
-
India News
Khushbu Sundar: వీల్‌ఛైర్ కోసం 30 నిమిషాలా?.. ఎయిరిండియాపై ఖుష్బూ అసహనం
-
Movies News
RRR: ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాలను వెనక్కి నెట్టి.. నంబరు 1గా ‘ఆర్ఆర్ఆర్’
-
Sports News
Ajinkya Rahane: ఐపీఎల్-15 సీజన్ తర్వాత లీసెస్టర్‌షైర్‌కు ఆడనున్న అజింక్య రహానె
-
Crime News
Crime News: అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం.. 14 మంది సజీవ దహనం
-
Movies News
Social Look: పూజాహెగ్డే ‘వెడ్డింగ్ ఫీవర్’.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అట్లీ దంపతులు