ఫోన్‌పే రూ.8,200 కోట్ల నిధుల సమీకరణ!

వాల్‌మార్ట్‌ నేతృత్వంలోని డిజిటల్‌ పేమెంట్స్‌ బ్రాండ్‌ అయిన ఫోన్‌పే తాజాగా 1 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.8,200 కోట్లు) నిధుల్ని సమీకరించేందుకు సిద్ధమవుతోందని ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలను ఉటంకిస్తూ ఒక ఆంగ్ల వార్తా సంస్థ వెల్లడించింది.

Published : 09 Dec 2022 04:17 IST

వాల్‌మార్ట్‌ నేతృత్వంలోని డిజిటల్‌ పేమెంట్స్‌ బ్రాండ్‌ అయిన ఫోన్‌పే తాజాగా 1 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.8,200 కోట్లు) నిధుల్ని సమీకరించేందుకు సిద్ధమవుతోందని ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలను ఉటంకిస్తూ ఒక ఆంగ్ల వార్తా సంస్థ వెల్లడించింది. జనరల్‌ అట్లాంటిక్‌తో పాటు ప్రస్తుత వాటాదార్లు టైగర్‌ గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌, ఖతర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ, మైక్రోసాఫ్ట్‌ కార్ప్‌ల నుంచి ఈ నిధుల్ని సమీకరించబోతోందని సమాచారం. దీంతో ఫోన్‌పే విలువ 13 బి.డాలర్ల (సుమారు రూ.1.07 లక్షల కోట్లు)కు చేరనుంది. ఈ నిధుల సమీకరణ వ్యవహారంపై ఫోన్‌పే ఇంకా స్పందించాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని