19న మౌలిక రంగానికి హామీ బాండ్ల బీమా ఉత్పత్తులు

మౌలిక రంగానికి ద్రవ్యలభ్యత పెంచేందుకు దేశంలోనే తొలిసారిగా హామీ (ష్యూరిటీ) బాండ్ల బీమా ఉత్పత్తులను డిసెంబరు 19న రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేయనుందని మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు.

Published : 09 Dec 2022 04:17 IST

విడుదల చేయనున్న రవాణా శాఖ

దిల్లీ: మౌలిక రంగానికి ద్రవ్యలభ్యత పెంచేందుకు దేశంలోనే తొలిసారిగా హామీ (ష్యూరిటీ) బాండ్ల బీమా ఉత్పత్తులను డిసెంబరు 19న రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేయనుందని మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. వీటి వల్ల కాంట్రాక్టర్లకు గొప్ప ఉపశమనం లభిస్తుందని తెలిపారు. పరిశ్రమ సంఘాల సమాఖ్య (సీఐఐ) నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. దేశంలో రహదారుల మౌలిక వసతులు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. హామీ బాండ్లు అనేవి కార్పొరేట్‌ బాండ్లు, ఫైనాన్షియల్‌ గ్యారెంటీలకు భిన్నమైనవి. ‘బ్యాంకు హామీల రూపంలో చిక్కుకొని పోయిన నిర్వహణ మూలధనాన్ని విడుదల చేసుకోవడం ద్వారా మౌలిక రంగంలో నిధుల లభ్యత పెరిగేందుకు హామీ బాండ్లు ఉపయోగపడతాయి. కాంట్రాక్టర్లు ఈ నిధులను వ్యాపార వృద్ధి అవసరాలకు ఉపయోగించుకోవచ్చ’ని మంత్రి గడ్కరీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని