Vehicle insurance: కొత్త కార్లకు మూడేళ్లు.. ద్విచక్ర వాహనాలకు అయిదేళ్లు

మోటారు వాహన బీమా నిబంధనలు మారబోతున్నాయి. కొత్త కార్లకు మూడేళ్లు; ద్విచక్ర వాహనాలకు అయిదేళ్ల పాటు పూర్తిస్థాయి బీమా అందుబాటులోకి రానుంది.

Updated : 09 Dec 2022 07:24 IST

మోటారు బీమా పాలసీ తీసుకునే అవకాశం
ఐఆర్‌డీఏఐ నూతన ప్రతిపాదనలు

ఈనాడు, హైదరాబాద్‌: మోటారు వాహన బీమా నిబంధనలు మారబోతున్నాయి. కొత్త కార్లకు మూడేళ్లు; ద్విచక్ర వాహనాలకు అయిదేళ్ల పాటు పూర్తిస్థాయి బీమా అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి నూతన ప్రతిపాదనలను భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ)  రూపొందించింది. దీని ప్రకారం సాధారణ బీమా సంస్థలు, ఒకేసారి ప్రీమియం మొత్తాన్ని వసూలు చేసి, కార్లకు మూడేళ్ల పూర్తి స్థాయి బీమా పాలసీ జారీ చేయవచ్చు. అదే విధంగా ద్విచక్ర వాహనాలకు అయిదేళ్ల పూర్తిస్థాయి బీమా ఇచ్చే అవకాశం లభిస్తుంది. ఇప్పటి వరకూ కార్లకు మూడేళ్లు, ద్విచక్ర వాహనాలకు అయిదేళ్ల థర్డ్‌ పార్టీ బీమా పాలసీలనే బీమా కంపెనీలు జారీ చేస్తున్నాయి. ఒక ఏడాది మోటారు బీమా పాలసీలకు వర్తించే నో-క్లెయిమ్‌ బోనస్‌ (ఎన్‌సీబీ) సదుపాయాన్ని, దీర్ఘకాలిక మోటారు బీమా పాలసీలకు సైతం అమలు చేస్తారు.

ఇదేవిధంగా అగ్నిప్రమాద బీమా, గృహ బీమా నిబంధనలకు సంబంధించి కొన్ని కొత్త ప్రతిపాదనలను ఐఆర్‌డీఏఐ జారీ చేసింది. దీని ప్రకారం 30 ఏళ్ల కాలానికి గృహ బీమా తీసుకోవచ్చు. అదే విధంగా దీర్ఘకాలిక అగ్ని ప్రమాద బీమా పాలసీలను, ఆ పాలసీల కాలపరిమితి ముగిసే లోపు రద్దు చేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని