సుదూర విమానాలు ఆలస్యం

సుదూర గమ్య స్థానాలకు (అల్ట్రా లాంగ్‌ హాల్‌) వెళ్లే కొన్ని విమానాలు ఆలస్యమవుతున్నాయని ఎయిరిండియా ప్రతినిధి ఒకరు తెలిపారు.

Published : 10 Dec 2022 04:06 IST

ఎంట్రీపాసుల సమస్యల వల్లే ఎయిరిండియా ప్రతినిధి

ముంబయి: సుదూర గమ్య స్థానాలకు (అల్ట్రా లాంగ్‌ హాల్‌) వెళ్లే కొన్ని విమానాలు ఆలస్యమవుతున్నాయని ఎయిరిండియా ప్రతినిధి ఒకరు తెలిపారు. విమానాశ్రయ ఎంట్రీ పాసులకు సంబంధించిన అంశాల వల్ల ఇది జరుగుతోందని, సంబంధిత అధికారులతో వీటిపై చర్చలు జరుపుతున్నట్లు వివరించారు. విమానాల సిబ్బంది (పైలట్లు, కేబిన్‌ సిబ్బంది), ఇంజినీర్లు, గ్రౌండ్‌స్టాఫ్‌, భద్రతా సిబ్బంది, ఇతర వ్యక్తులను విమానాశ్రయంలోకి అనుమతించే ఎయిర్‌పోర్ట్‌ ఎంట్రీ పాసుల (ఏఈపీఎస్‌)ను బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ (బీసీఏఎస్‌) జారీ చేస్తుంది. ‘కొన్ని మా ఉత్తర అమెరికా విమానాలు ఆలస్యమవుతున్నాయని చెప్పడానికి చింతిస్తున్నాం. ఎంట్రీ పాసులను అంచనా కంటే తక్కువ వేగంతో జారీ చేస్తుండడంతో ఈ సమస్య వస్తోంద’ని ఎయిరిండియా ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఆ తర్వాత మాత్రం పాసుల జారీ విషయంలో బీసీఏఎస్‌ సహాయపడుతోందని ఎయిరిండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిరిండియా ప్రతినిధి కూడా ప్రాసెసింగ్‌ సమయం అధికంగా ఉండడానికి బీసీఏఎస్‌ కారణం కాదంటూ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని