గృహ రుణ రేట్ల పెంపు

ఆర్‌బీఐ రెపో రేటును 35 బేసిస్‌ పాయింట్ల మేరకు పెంచడంతో బ్యాంకులు ఆ భారాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తున్నాయి. రెపో ఆధారిత వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నాయి.

Published : 10 Dec 2022 04:10 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్‌బీఐ రెపో రేటును 35 బేసిస్‌ పాయింట్ల మేరకు పెంచడంతో బ్యాంకులు ఆ భారాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తున్నాయి. రెపో ఆధారిత వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నాయి.

* పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ తన ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ను 0.35% పెంచింది. దీంతో గృహరుణ రేటు 8.40% నుంచి 8.75 శాతానికి చేరుకుంది. రెపో రేటు 6.25 శాతానికి అదనంగా 2.50 శాతాన్ని వసూలు చేస్తున్నట్లు పేర్కొంది. కొత్త రేట్లు గురువారం నుంచే అమల్లోకి వచ్చాయి.

* కెనరా బ్యాంకు  రెపో ఆధారిత వడ్డీ రేటును 8.80 శాతానికి పెంచింది. ఈ నెల 7 నుంచే ఇది అమల్లోకి వచ్చింది. అయితే ఈ నెల 31 వరకు వడ్డీ రేట్లపై 25 బేసిస్‌ పాయింట్ల మేరకు ప్రత్యేక రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. దీంతో మహిళా రుణగ్రహీతలకు 8.55 శాతానికి, ఇతరులకు 8.60 శాతానికి గృహరుణం అందనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని