హైదరాబాద్‌కు వ్యాపార పర్యటనలు 100 శాతం పెరిగాయ్‌

వ్యాపార పర్యటనలు హైదరాబాద్‌కు 100 శాతం పెరిగినట్లు ఆతిథ్య సంస్థ ఓయో వెల్లడించింది.

Published : 10 Dec 2022 04:14 IST

దేశీయ సగటు 83%

దిల్లీ: వ్యాపార పర్యటనలు హైదరాబాద్‌కు 100 శాతం పెరిగినట్లు ఆతిథ్య సంస్థ ఓయో వెల్లడించింది. బిజినెస్‌ ట్రావెల్‌ ట్రెండ్స్‌ రిపోర్ట్‌ 2022 పేరిట వెలువరించిన నివేదికలో, గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వ్యాపార పర్యటనలు దేశంలోని వివిధ నగరాలకు ఏ స్థాయిలో పెరిగాయో వెల్లడించింది. దేశంలోని ప్రధాన నగరాలకు వ్యాపార పర్యటనలు సగటున 83 శాతం పెరిగినట్లు తెలిపింది. యువ వ్యాపార ప్రతినిధులు, చిన్న వ్యాపారులు, ఔత్సాహికవేత్తలు ఎక్కువగా పర్యటిస్తున్నారని పేర్కొంది. కొవిడ్‌ పరిణామాల వల్ల రెండేళ్ల పాటు వ్యాపార సెంటిమెంటు స్తబ్దుగా ఉండగా, ఈ ఏడాది గణనీయంగా పుంజుకున్నట్లు వివరించింది. ఏడాది క్రితం ఇదే సమయంతో పోలిస్తే, ఈ ఏడాది ఏప్రిల్‌-నవంబరులో హైదరాబాద్‌కు వ్యాపార పర్యటనలు 100 శాతం పెరిగాయి. ఈ ధోరణి కొనసాగుతుందని ఓయో చీఫ్‌ గ్రోత్‌ ఆఫీసర్‌ కవిక్రుత్‌ అంచనా వేశారు. దక్షిణాదిలో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, కోయంబత్తూర్‌ ప్రధాన వ్యాపార నగరాలుగా అవతరించినట్లు పేర్కొన్నారు. కొవిడ్‌ పరిణామాల వల్ల రెండేళ్ల పాటు దృశ్యమాధ్యమ పద్ధతుల్లో సమావేశాలు నిర్వహించుకున్నా, నేరుగా సంప్రదింపులకే మళ్లీ సుముఖత చూపుతుండటమే వ్యాపార పర్యటనలు పెరిగేందుకు కారణమయ్యాయని విశ్లేషించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని